Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మందు తాగడం మానేసారా?..మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే!..షాకింగ్ నిజం బయటకి
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనం తరచుగా వింటుంటాం. మద్యపానం ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని..ఇది శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అధికంగా మద్యం సేవించడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయని.. మద్యపానం మెదడు పనితీరును తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని నిపుణులు తరచుగా చెబుతుంటారు. అయితే పలు పరిశోధనలు మాత్రం పరిమితంగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదే అని చెబుతుండటం కూడా మనం చూస్తుంటాం. అయితే కొంతకాలం పాటు మందుతాగి సడెన్ గా మానేస్తో ఏం జరుగుతుందో తెలుసా? దీనిపై 10 ఏళ్ల పాటు జరిగిన ఓ అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(JAMA)లో పబ్లిష్ అయ్యాయి.
టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, యూఎస్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ కి చెందిన పరిశోధకులు జపాన్ లో 10 ఏళ్ల పాటు 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు 57,700 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో.. మద్యం సేవించడం కొనసాగించేవారితో పోల్చితే.. మద్యపానం మానేసినవారిలోనే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్(LDL)ఎక్కువగా, గుడ్ కొలెస్ట్రాల్(HDL)తక్కువగా ఉందని తేలింది.

పరిశోధనలో మద్యం సేవించడం చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి,గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడానికి కారణమైంది..అయితే మద్యం సేవించడం మానేయడం దీనికి విరుద్ధమైన సంబంధాన్ని చూపించింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయమే.
రిపోర్ట్ లో ఇలా చెప్పారు
మొత్తం ఆరోగ్య ప్రమాదాల కారణంగా మద్యం వినియోగంపై విమర్శలు పెరుగుతున్నప్పటికీ..మద్యం వినియోగంలో మార్పులు,ముఖ్యంగా మానేయడం లిపిడ్ ప్రొఫైల్ లను ఎలా ప్రభావితం చేస్తాయో తెలియదని పరిశోధకులు చెప్పారు. ఆల్కహాల్ తగ్గింపు తర్వాత వ్యక్తులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాద నిర్వహణను ఆప్టిమైజ్ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ మార్పులను జాగ్రత్తగా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుత అధ్యయనంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిందని,మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో సంబంధం ఉందని తేలిందని..అయితే మద్యం సేవించడం మానేయడం వల్ల తక్కువ అనుకూలమైన మార్పులు వస్తాయని పరిశోధకులు తమ రిపోర్ట్ లో చెప్పారు.
మద్యం వల్ల కలిగే హృదయ సంబంధ ప్రయోజనాలపై పరిశోధన మాదిరిగానే..అధికంగా తాగేవారు కానీ మద్యం సేవించడం మానేసిన వ్యక్తులను విశ్లేషణ నుండి మినహాయించినట్లయితే కొలెస్ట్రాల్ స్థాయిలపై మద్యం సేవించడం వల్ల వాస్తవానికి ఎటువంటి ప్రయోజనం లేదని డేటా చూపిస్తుందని ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ స్టీఫెన్ బ్రైట్ అన్నారు.
WHO ఏం చెబుతుందంటే
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏ స్థాయిలో మద్యం సేవించినా ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలిపింది. మద్యం.. వ్యాధులు, గాయాలు, అకాల మరణాలకు ప్రధాన ప్రమాద కారకం, ఇది క్యాన్సర్లు, కాలేయ వ్యాధి, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది. అధిక పన్నులు, ప్రకటనల పరిమితులు, తగ్గిన లభ్యత వంటి విధానాల ద్వారా ఆల్కహాల్ సంబంధిత హానిని నివారించవచ్చని WHO నొక్కి చెబుతుంది. మద్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తప్పుదారి పట్టించే వాదనలకు వ్యతిరేకంగా కూడా ఇది హెచ్చరిస్తుంది. కాబట్టి మీకు మద్యపానం అలవాటు ఉంటే దానిని మానేయడానికి డాక్టర్ల సహాయం తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications