Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Right time to drink coffee:ఆ టైంలో కాఫీ తాగుతున్నారా? అకాల మరణం వచ్చే ఛాన్స్..పరిశోదనలో సంచలన నిజాలు
ఈ రోజుల్లో టీ, కాఫీ తాగే అలవాటు లేనివాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. కొంతమంది అయితే రోజులో 10సార్లు పైనే టీ కాఫీలు తాగేస్తుంటారు. కాఫీ ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండింటిపై తరచూ చర్చలు జరుగుతున్నప్పటికీ కాఫీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీ తాగడం మంచిదే అయినా దాన్ని రోజులో ఏ సమయంలో ఎంత తాగాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కాఫీ వినియోగం..టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, అకాల మరణంతో సంబంధం కలిగి ఉంటదని తాజాగా పరిశోధనలో కనుగొన్నారు. తాజా పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈ పూట తాగితేనే మంచిది
యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఉదయం మాత్రమే కాఫీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. కాఫీ తాగని వ్యక్తులతో పోలిస్తే..ఉదయం పూట మాత్రమే కాఫీ తాగే వాళ్లలో ఏదైనా కారణం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం 16 శాతం తక్కువగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 31శాతం తక్కువగా ఉంటుంది. ఇక రోజంతా కాఫీ తాగే అలవాటున్న వారిలో రిస్క్‌లో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు.

పరిశోధన ఎలా జరిగింది?
అమెరికాలోని టులేన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు 1999- 2018 సంవత్సరాల మధ్య 40725 మందిపై పరిశోధన చేశారు. 1999 నుండి 2018 వరకు నిర్వహించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే నుండి 18, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 40725 మంది పెద్దల ఆహార,ఆరోగ్య డేటాను అధ్యయనం చేశాశారు అధ్యయనంలో భాగంగా పాల్గొనే వారి రోజువారీ ఆహారం గురించి ప్రశ్నించారు. ఒక రోజులో ఎంత కాఫీ తాగారు, ఏ సమయంలో తాగారు వంటి అనేక ప్రశ్నలు అడిగారు.
అయితే ఉదయం పూట కాఫీ తాగడం గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తుందో ఈ అధ్యయనం వివరించలేదు. మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగడం అనేది సిర్కాడియన్ రిథమ్‌లకు, మెలటోనిన్ వంటి హార్మోన్ స్థాయిలకు భంగం కలిగించవచ్చని తెలిపారు. ఇది వాపు, రక్తపోటు వంటి సమస్యలకు కారణమవుతుందని పరిశోధనలో పాల్గొన్న ఓ డాక్టర్ తెలిపారు.
కాఫీ ఎప్పుడు తాగాలి
మీ రోజులో కాఫీ తాగడం ప్రారంభించడానికి ఉత్తమ సమయం కార్టిసాల్ పీక్ తర్వాత అని అంటే ఉదయం ఉదయం 9 నుండి 11:30 గంటల మధ్య సమయాలలో కెఫిన్ తీసుకోవడం సరైనదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications