Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
ఈ డ్రింక్ తాగితే మీ ఆయుష్షు డబుల్ అవుతుంది.. 100% ఇది నిజం..!
ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడి తాగేది కాఫీ. దీనిని తాగితే మెదడు ప్రశాంతంగా మారడంతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. రోజులో కనీసం నాలుగైదు సార్లు కాఫీ తాగే వ్యక్తులు కూడా ఉన్నారు. ఉదయాన్నే లేవగానే కాఫీతో రోజును ప్రారంభించి.. రాత్రి పడుకునేటప్పుడు కూడా కాఫీతో రోజును ముగించే వారు కూడా ఉన్నారు. అయితే పరిమితంగా కొన్ని సమయాల్లో కాఫీ తాగడం వల్ల ఆయుష్షు డబుల్ అవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. దానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాఫీ తాగితే ఆయుష్షు నిజంగానే పెరుగుతుందా?
కాఫీ అనేది అన్ని పానీయాల మాదిరిగానే ఒక సాధారణ పానీయం. అయితే పరిమిత పరిమాణంలో ఈ కాఫీ తాగడం వల్ల అనేక మంచి ప్రయోజనాలను పొందొచ్చని న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో వెల్లడైంది. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని అందులో తేలింది. 1999-2018 మధ్య జన్మించిన 40,725 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఈ పరిశోధనలో ఉదయాన్నే కాఫీ తాగే వ్యక్తుల ఆయుష్షు 16 శాతం పెరిగిందని తేలింది. అలాగే ఉదయాన్ని కాకుండా రోజులో ఇతర సమయాల్లో కాఫీ తాగే వారిలో కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయని, వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు గుర్తించామని పేర్కొన్నారు.
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఎవరైతే ఉదయాన్నే కాఫీ తాగుతారో వారిలో గుండె సంబంధిత సమస్యలు రావడం చాలా అరుదు. అలాగే వారిలో అనారోగ్య సమస్యలు కూడా చాలా అరుదుగా వస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు.
కాఫీ తాగితే ఇతర ప్రయోజనాలు
కాఫీ తాగితే ఆయుష్షు పెరగడం మాత్రమే కాదు. కొన్ని ఇతర ఉపయోగకరమైన ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటంటే కాఫీ తాగడం వల్ల మెదడుకు ప్రశాంతత దొరుకుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించుకునేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా కాఫీ బాగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications