Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Coffee: ఇలాంటి కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందట.. లేటెస్ట్ రీసెర్చ్‌లో దిమ్మతిరిగే నిజాలు!
చాలా మందికి రోజుకో కప్పు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వ్యక్తులకు ఓ శుభవార్త. పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కోయింబ్రాకు చెందిన రోడ్రిగో కున్హా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. రోజూ కాఫీ తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని ఆ పరిశోధనలో తేలింది. ఈ మేరకు ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ అనే ప్రముఖ సైన్స్ కథనం ప్రచురితం అయ్యింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అధ్యయనంలో ఏం తేలిందంటే?
శాస్త్రవేత్తలు నిర్వహించిన ఆ పరిశోధనలో రోజూ కాఫీ తాగేవారు సగటున 2 సంవత్సరాల పాటు ఎక్కువగా జీవిస్తున్నారట. కొంతమంది 2 కంటే ఎక్కువ సంవత్సరాలు కూడా తమ ఆయుష్షును పెంచుకుంటున్నారని, ఇది కేవలం కాఫీ తోనే సాధ్యమని వెల్లడైంది. కాఫీలో కేవలం కెఫిన్ మాత్రమే కాదని, శరీరానికి, ఆరోగ్యానికి వయసును పెంచే ఎన్నో రకాల మూలకాలు కూడా దాగి ఉన్నాయని పేర్కొన్నారు.

కాఫీలో ఏం ఏం ఉంటాయంటే?
కాఫీలో కేవలం కెఫిన్ మాత్రమే ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ తాజా అధ్యయనంలో అది తప్పు అని తేలింది. కాఫీలో కెఫిన్‌తో పాటు రెండు వేల కంటే ఎక్కువ బయో యాక్టీవ్ కాంపౌండ్స్ ఉంటాయని, ఈ హెల్త్ కాంపౌండ్స్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఇందులో కొన్ని మెదడు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయని, అలాగే మెదడు పని తీరును మెరుగుపరుస్తామని వెల్లడించారు. దీంతో పాటు మెదడుకు సంబంధించిన రోగాలను నయం చేస్తుందని ఆ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు.
శరీరాన్ని లోపలి నుంచి..
పెరుగుతున్న కాలుష్యం, కాలుష్యానికి కారకమైన ఆహరం తినడం వల్ల శరీరంలోని భాగాలు డ్యామేజ్ అవుతున్నాయి. దీనిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటారు. అయితే కాఫీలో ఉండే బయో యాక్టీవ్ హెల్త్ కాంపౌండ్స్.. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. దీంతో జీవించే వయసు పెరుగుతుంది.
అలాగే మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరగాల్సిన బయోలాజికల్ ప్రాసెస్ అనేది నెమ్మదిస్తుంది. దీని కారణంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ప్రతిరోజూ లిమిట్‌లో కాఫీ తాగడం వల్ల.. బయోలాజికల్ ప్రాసెస్‌ను ఉత్తేజపరచొచ్చు. వయసు ఎక్కువవుతున్నా మన శరీరాన్ని యవ్వనంగా, యాక్టీవ్‌గా ఉంచుకోవచ్చు.
వాళ్ళు కూడా కాఫీ తాగొచ్చు
చాలా మంది అరవై లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు కాఫీ తాగకూడదని, ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో హాని చేస్తుందని చెప్తుంటారు. అయితే వృద్ధాప్యంలోనూ కాఫీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతామని ఆ పరిశోధనలో తేలింది. కాఫీ తాగడం వల్ల వయసుతో పాటు వచ్చే ఎన్నో రోగాలు నయమవడంతో పాటు ఆయుస్సు కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications