Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
టీ, కాఫీలు ఇలా తాగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ రావడం కన్ఫర్మ్! ఎందుకంటే?
ఉదయం లేవగానే మనందరికీ టీ కావాల్సిందే. కొంతమందికి కాఫీ అలవాటు ఉంటుంది. తలనొప్పిగా ఉన్నా, కొంచెం స్ట్రెస్‌గా అనిపించినా టీ, కాఫీలు తాగేస్తుంటాం. అది కూడా చాలా వేడిగా ఉండాల్సిందే. నోరు కాలినా, నాలుక తడబడినా టీ లేదా కాఫీ వేడి వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి అని అనుకుంటాం. అలా తాగితేనే అందం, ఆనందం అని భావిస్తుంటాం.
అయితే ఇలా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వేడి వేడిగా ఉన్నప్పుడు టీ, కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అందులో వెల్లడైంది. అసలు వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగితే ఎందుకు ప్రమాదం, అధ్యయనంలో ఏం తేలింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అన్నవాహిక దెబ్బతింటుంది..
సాధారణంగా మనం వేడి లేదా చల్లటి వస్తువులు తినేటప్పుడు అన్నవాహిక వద్ద వేడిగా ఉండడం గమనిస్తుంటాం. అయితే అత్యంత వేడిగా ఉండే కాఫీ లేదా టీ తాగేటప్పుడు అన్నవాహిక దెబ్బతింటుందని నిపుణులు తేల్చారు. అలాగే అన్నవాహిక పొలుసులు కణాలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, దీని ద్వారా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎలా వస్తుంది?
నిపుణుల ప్రకారం.. అలాగే ఆ అధ్యయనంలో తేలింది ఏంటంటే.. వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగడం వల్ల సత్వరమే క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేనప్పటికీ.. దీర్ఘకాలంలో ఇలానే వేడి వేడి టీ, లేదా కాఫీ తాగడం వల్ల కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువ కాలంలో అన్నవాహిక వేడి వేడి పానీయాలను గ్రహించడం వల్ల అనవసరమైన, అసాధారణమైన కణాలు వృద్ధి చెందుతాయని, అవి క్రమంగా క్యాన్సర్ కణాలుగా మారుతాయని పేర్కొన్నారు.
క్యాన్సర్‌తో పాటు..
సౌత్ కోల్‌కతాలోని AMD క్లినిక్ నిపుణుల ప్రకారం.. వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగేటప్పుడు అన్నవాహిక క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని తేలింది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా మనిషిని ప్రభావితం చేస్తాయని వెల్లడైంది. వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
పరిష్కారం ఏంటి?
ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎవరూ కాఫీ, టీలు తాగకుండా ఉండలేరు. ఎందుకంటే అది మన జీవితంలో ఎంతగానో ఇమిడిపోయి ఉంటుంది కాబట్టి. అందుకే రోగాల బారిన పడకుండా ఉండేందుకు వేడి వేడిగా ఉన్నప్పుడే కాఫీ, టీలు తాగకుండా.. ఒక రెండు నిమిషాల పాటు ఉంచి వాటిని చల్లారనివ్వాలి. అనంతరం తాగితే బాగుటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి కూడా ఎలాంటి ప్రమాదం జరగదని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications