Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నీళ్లు తాగడం మంచిదే కానీ..? నీళ్లు తాగడంపై హద్దు మీరితే అంతే..!
మంచినీళ్లు తాగడంపై చాలా మందికి చాలా అపోహలున్నాయ్. కొందరు మంచినీళ్లు ఎక్కువగాా తాగడం మంచిది కాదంటారు. ఇలాంటి అపోహలపై కిమ్స్ ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ జగదీష్ కుమార్ విలువైన సూచనలు ఇస్తున్నారు.
నీళ్లు ఎక్కువ తాగాలనిపించి తాగేవారు సైకోజెనిక్ పాలిడిప్సియాతో బాధపడుతుంటారని డాక్టర్ జగదీష్ అభిప్రాయపడుతున్నారు. నీళ్లు ఎక్కువగా శరీరంలోకి తీసుకుంటే ఎలక్టోరైట్లు బ్యాలెన్స్‌గా లేకపోవడం, హైపొనొట్రేమియాకు గురికావడం జరుగుతుందని అంటున్నారు.

ప్రతి రోజు ఒక మనిషి 2.5 నుంచి 4 లీటర్ల వరకు నీళు తాగితే ఏసమస్యాలేదంటున్నారు. హైడ్రేటెడ్‌గా ఉండాలంటే శరీర బరువుకి 0.03 బరువుకి సమానంగా నీళ్లు తాగాలన్నారు పోషకనిపుణులు డాక్టర్ అవని మేకల సూచనలిస్తూ.. నీళ్లు మంచిగా తాగితే జీర్ణవ్యవస్థ, చర్మం ఆరోగ్యంగా మారి, శరీరంలో విషపదార్ధాలు బయటకు పోతాయంటున్నారు. మరోవైపు ఎక్కువ నీళ్లు తీసుకుంటే అధిక రక్తపోటు, నీరసం, ఉబ్బసం లాంటి సమస్యలూ రావచ్చంటున్నారు.
మొత్తంగా నీళ్లు ఎక్కువ తాగడం మంచిదే కాని శరీరాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అది మారుతుందని చెబుతున్నారు. వైద్యుల సూచనలు తీసకున్న తరువాతే ఎంత మోతాదులో నీళ్లు తాగాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications