Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మనలో చాలామంది గ్రీన్ టీ(Green Tea) తాగుతుంటాం. అయితే కొంతమంది ఆరోగ్యానికి మంచిది అనుకుంటూ రోజుకి నాలుగైదు కప్పుల గ్రీన్ టీ తాగేస్తుంటారు. ముఖ్యంగా ఆఫీసులలో లేదా ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అయితే గ్రీన్ టీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకమే అయితే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. గ్రీన్ టీని అతిగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇక్కడ చూద్దాం.

కెఫిన్
గ్రీన్ టీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి ప్రవేశించి నిద్రలేమి,ఏకాగ్రత తగ్గడం,మానసిక ఆందోళనలు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఆందోళన స్థాయులు పెరుగుతాయి. శరీరంలోని నాడీ వ్యవస్థ స్తంభించిపోవచ్చు.
జీర్ణ సమస్యలు
గ్రీన్ టీ ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ఉన్న టానిన్ అనే పదార్థం ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది తద్వారా కడుపులో మంట,అస్వస్థత కలిగిస్తుంది. అజీర్తి వంటి సమస్యలు కూడా ఎక్కువగా గ్రీన్ టీ తీసుకున్నప్పుడు తలెత్తవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్
యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ వీటిని అధిక మోతాదులో తీసుకుంటే ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల అధికత శరీరంలోని ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపడం వల్ల కణజాల క్షయం సమస్యలు తలెత్తుతాయి.
మినరల్స్ శోషణను తగ్గించడం
గ్రీన్ టీ లో ఉండే టానిన్లు శరీరానికి అవసరమైన ఐరన్,ఇతర మినరల్స్ ని గ్రహించనీయకుండా అడ్డుకుంటాయి. ఇది రక్తహీనత,ఐరన్ లోప సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ ని నియంత్రిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.
గర్భిణీ స్త్రీలకు హానికరం
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని ఫోలిక్ యాసిడ్ స్థాయులు తగ్గుతాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ తాగేటప్పుడు వైద్యుల సూచనలను పాటించడం మంచిది.
లివర్ కు హానికరం
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల అధిక మోతాదు శరీరంలో విషపూరిత పదార్థాలను చేరవేస్తుంది. తద్వారా లివర్ ఫంక్షన్ సక్రమంగా జరగకుండా చేస్తుంది. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు కప్పులకంటే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవడం మంచిది కాదు.
తలనొప్పి, మైగ్రేన్
గ్రీన్ టీ ఎక్కువగా తాగితే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందులోని కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలను ప్రభావితం చేసి తలనొప్పి సమస్యను ఎక్కువ చేస్తుంది.
అస్తమా, అలెర్జీ
కొంతమందికి గ్రీన్ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల అస్తమా లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గ్రీన్ టీ లో ఉండే కొన్ని పదార్థాలు శ్వాస సంబంధిత అలెర్జీలు కలిగించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications