Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Stomach Flu: ఏది పడితే అది తింటే పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తుంది జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వేసవికాలం వచ్చిన తర్వాత ఈ స్టమక్ ఫ్లూ కేసులు బెంగళూరులో పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కడుపు సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య 15 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఏది పడితే అది తినడం, చెడి పోయిన ఆహారాలు, కలుషిత ఆహారాలు తినడం వల్ల పొట్ట అసౌకర్యంగా అనిపించడం, వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపించినప్పుడు అది పొట్ట ఇన్ఫెక్షన్ (Stomach Flu) కూడా కావొచ్చు.

స్టమక్ ఫ్లూ వైరస్ వల్ల సంక్రమిస్తుంది. పెద్దల్లో, పిల్లల్లో కనిపించే అంటువ్యాధి. స్టమక్ ఫ్లూ వ్యాధికి గురైనప్పుడు 48 గంటల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు 2 నుండి 5 రోజుల వరకూ ఉంటాయి. కొంత మందిలో 10 రోజుల వరకు కూడా ఉండొచ్చు. స్టమక్ ఫ్లూను గ్యాస్ట్రో ఎంటెరిటిస్ అని కూడా పిలుస్తారు.
స్టమక్ ఫ్లూ లక్షణాలు:
* వికారం, వాంతులు
* డయేరియా
* కడుపు తిమ్మిరి, కడుపు నొప్పి
* ఆకలి లేకపోవడం
* తలనొప్పి
* జ్వరం
* డీహైడ్రేషన్
స్టమక్ ఫ్లూ నివారణ చిట్కాలు:
1. హైడ్రేటెడ్ గా ఉండాలి
స్టమన్ ఫ్లూ కారణంగా వాంతులు, విరేచనాల వల్ల శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే నీరు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం-పుదీనాతో చేసే హెర్బల్ టీ, కాయగూరలు ఉడికించిన నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.
2. కోడిగుడ్లు తినాలి
పొట్ట ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కోడిగుడ్లు తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ బి, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి.
3. BRAT ఆహారాలు తీసుకోవాలి
బనానా, అన్నం, యాపిల్ సాస్, టోస్ట్ వంటివి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంతో పాటు వాటిలోని ఇతర పోషకాలూ శరీరానికి అందుతాయి.
4. ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి
ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వీటిలో కొవ్వులు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కాక సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.
5. పండ్ల రసాలకు దూరంగా ఉండాలి
పండ్ల రసాలలో అధిక చక్కెర స్థాయిలు విరేచనాల సమస్యను మరించ పెంచుతాయి. అందుకే ఒకటీ ఒకటిన్నర పండు తినడం మంచిదని చెబుతున్నారు వైద్యులు.
6. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి
స్టమక్ ఫ్లూతో బాధపడుతున్న సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించాలి. కంటి నిండా నిద్రపోవాలి. శారీరకంగా విశ్రాంతి తీసుకునే సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
7. హీటింగ్ ప్యాడ్ వాడాలి
ఫ్లూ కారణంగా వచ్చే కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి హీటింగ్ ప్యాడ్, హాట్ బ్యాగ్ లాంటివి వాడాలి. వీటి వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అవి లేకపోతే వేడి నీటిలో క్లాత్ ముంచి దాంతో పొట్టపై కాపడం పెట్టుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications