Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Weight Loss Tips: ఇలా డ్రైఫ్రూట్స్ తింటే అలా బరువు తగ్గుతారు..
డ్రైఫ్రూట్స్.. పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఎండు ఫలాల్లో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ లో మంచి కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి. గర్భిణీలు, చిన్న పిల్లలు, పెద్ద వారు అందరూ నిరంభ్యతరంగా డ్రైఫ్రూట్స్ తినొచ్చు. బరువు పెరగాలనుకునే చాలా మందికి ఎంజుఫలాలు పుష్కలంగా తినాలని సిఫార్సు చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్ తో బరువు పెరగడంతో పాటు ఒక పద్ధతిలో తింటే బరువు తగ్గొచ్చు కూడా. డ్రైఫ్రూట్స్ తింటూ బరువు ఎలా తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి ఏ డ్రై ఫ్రూట్ మంచిది?
1. నట్స్
నట్స్‌లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. బరువు తగ్గడానికి నట్స్ మంచి ఎంపిక.
బాదం:
బాదంలో ఉండే ప్రోటీన్ లీన్ కండర ద్రవ్యరాశిని నిర్మించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది.
జీడిపప్పు:
జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఎక్కువ కేలరీలు కరిగించడానికి సహాయపడుతుంది.
వాల్‌నట్‌లు:
వాల్‌నట్స్‌లోని ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఆకలి తక్కువ వేస్తే తక్కువ తింటాం.
పిస్తా:
పిస్తాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే పిస్తాలోని పోషకాలు బాడీ మాస్ ఇండెక్స్ ను తగ్గించడానికి దోహం చేస్తాయి. అధిక బరువు, ఊబకాయంతో ఉన్న వారికి పిస్తా మంచి ఎంపిక.
2. ఖర్జురా:
ఖర్జూరాల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఖర్జూరాలు సహజ స్వీటెనర్లు. చక్కెర, బెల్లం, తేనె కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. ఖర్జూరాల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. భోజనం తర్వాత డెజర్ట్ గా తినొచ్చు. అలాగే తీపి పదార్థాలు తినాలనిపించినప్పుడు ఖర్జూరాలు మంచి ఎంపిక.
3. ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎండుద్రాక్షలు మంచి ఎంపిక. క్రమం తప్పకుండా ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరం లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలి హార్మోన్లను ఉత్పత్తి విధానాన్ని మారుస్తుంది. లెప్టిన్ హార్మోన్ ఆకలిని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి:
* ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసిన ఆహారాలకు బదులు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
* సాయంత్రం వేళ స్నాక్స్ కు బదులు డ్రైఫ్రూట్స్ తినొచ్చు
* వ్యాయామానికి ముందు లేదా తర్వాత డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ప్రోటీన్ బార్ తినొచ్చు
* సమతుల్య ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ తినొచ్చు.
డ్రై ఫ్రూట్స్ తినడానికి బెస్ట్ టైం:
చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినాలని చెబుతుంటారు. రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లోని ఫైబర్ మెత్తబడి, అందులోని పోషకాలు సక్రమంగా అందుతాయి.
ఉదయం అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనం చేశాక, సాయంత్రం సమయంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆకలి తీరుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే అర్టిఫీషియల్ స్వీటెనర్ల కంటే డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications