లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.!

మహిళలు లిప్‌స్టిక్‌ లేకుండా బయటకు వెళ్లడం కాస్త కష్టమే. ఆఫీస్, పార్టీస్‌, శుభకార్యాలు, ఫంక్షన్స్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా పెదాలకు రంగు అద్దాల్సిందే. ఎంత మేకప్‌ వేసుకున్నా లిప్‌స్టిక్‌ వేసుకోగానే వచ్చే లుక్‌ వేరు. కానీ లిప్‌స్టిక్‌ వల్ల చాలా మందిలో సందేహాలు నెలకొన్నాయి. దీనిని తరచూ వేసుకుంటే పెదాలు పొడిబారుతాయా, నల్లగా మారుతాయా.. ప్రతిరోజూ పెట్టుకుంటే పెదాలకి, చర్మానికి సురక్షితమేనా అని ఒక ఆందోళన మొదలైంది. మరి ఇందులో నిజమెంత.. తెలుసుకుందాం..

Dry lips reasons mistakes women make when buying lipstick

ప్రతిరోజూ లిప్‌స్టిక్‌ వేసుకోవడం ద్వారా పెదవులు వాటిపైన సహజ తేమను కోల్పోతాయని చాలా మంది భావిస్తారు. మరికొందరు క్వాలిటీ లిప్‌స్టిక్‌ వాడితే అధరాలు తాజాగా, మెరుస్తూ ఉంటాయని నమ్ముతారు. అయితే వీటి కారణంగానే పెదవుల్లో మార్పు వస్తుందా.. పెదవులు పొడి బారడానికి, నల్లగా అవ్వడానికి అసలు కారణమేంటి.. పెదవుల సంరక్షణలో మహిళలు చేసే పొరపాట్లు ఏంటి.. బ్యూటీ నిపుణుల సలహాలు చూద్దాం..

చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు?చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు?

ప్రతీ లిప్‌స్టిక్‌ పెదవులను పొడిబారేలా చేయదని నిపుణులు అంటున్నారు. ఎలాంటి లిప్‌స్టిక్‌ సెలెక్ట్‌ చేసుకుంటున్నారనే దానిపైనే వాటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో మ్యాట్‌ లిప్‌స్టిక్‌లు ఎంచుకున్నట్లయితే అవి పెదవులను హెల్తీగా ఉంచుతాయి. అయితే మరికొందరిలో లిప్స్‌ పొడిబారినట్లు అనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మీ పెదాలు పొడిబారినట్లు ఉంటే.. మ్యాట్‌ లిప్‌స్టిక్‌ వేసుకున్నాక అది ఇంకా క్లారిటీగా కనిపించవచ్చు. ఆధునిక మ్యాట్‌ లిప్‌స్టిక్‌లలో విటమిన్‌ ఇ, హైలురోనిక్‌ యాసిడ్‌ వంటి తేమని ఇచ్చే పదార్థాలు ఉంటాయి. అయితే దీనిని ఎక్కువసేపు, ఎక్కువ సార్లు రాస్తే చర్మం పొడిబారే ప్రమాదం ఉంది.

లిప్‌స్టిక్‌ కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండ్‌, క్వాలిటీ పదార్థాలతో తయారు చేసినవి కొనుగోలు చేయడం ఉత్తమం. ఇవి పెదాలను సురక్షితంగా ఉంచుతాయి. గడువు తీరిన, క్వాలిటీ తక్కువ ఉన్న వాటిని వాడితే పెదాల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అదేవిధంగా పెదవులకు తగినంత పోషణ లేకపోయినా అవి దెబ్బతినవచ్చు.

Dry lips reasons mistakes women make when buying lipstick

పెదాలు ఎందుకు నల్లబడతాయి

అయితే కేవలం లిప్‌స్టిక్‌ కారణంగా మీ పెదాలు నల్లబడతాయని అపోహ పడొద్దు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ధూమపానం అలవాటు, సూర్యకాంతిలో ఎక్కువ సేపు ఉండటం, అలర్జీలు, పుష్కలంగా నీరు తాగకపోవడం, చల్లని, పొడి వాతావరణంలో ఉండటం, పదేపదే నాలుకతో పెదాలు తడపడం, విటమిన్‌ లోపం, తక్కువ క్వాలిటీ లిప్‌బామ్‌లు వాడటం పెదాల ఆరోగ్యాన్ని, తేమను దెబ్బతీస్తుంది. లిప్‌బామ్‌ విషయానికొస్తే SPF ఉన్న వాటిని వాడటం బెటర్‌.

గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!

ఎలాంటి వాటిని కొనుగోలు చేయాలి

లిప్‌స్టిక్‌ కొనుగోలు చేసేటప్పుడు విటమిన్ E ఉన్న ప్రొడక్ట్‌ కొనుగోలు చేయడం ఉత్తమం. షియా బటర్‌, జోజోబా నూనె కలిగిన ఉత్పత్తులు లిప్స్‌కి మేలు చేస్తాయి. పారాబెన్లు, ఘాటైన సువాసనలు ఉన్న వాటిని వాడకండి. నమ్మకమైన బ్రాండ్‌ను మాత్రమే ఎంచుకోండి. లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు ఎక్స్‌పయిరీ డేట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.

Dry lips reasons mistakes women make when buying lipstick

లిప్‌స్టిక్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా అవసరమే

సరైన లిప్‌స్టిక్‌ వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పెదాలపై తేమ కోల్పోకుండా కాపాడుకోవచ్చు. రోజులో వీలైనన్ని సార్లు SPF ఉన్న లిప్‌బామ్‌ రాయండి. పుషఅకలంగా నీరు తాగండి. రాత్రి పడుకునేముందు లిప్‌స్టిక్‌ తీసేయండి. ఆ సమయంలో లిప్‌ మాస్క్‌ లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేస్తే పెదాలు తాజాగా ఉంటాయి. అప్పుడప్పుడూ పెదాలపై ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడం మంచిది.

వీరు జాగ్రత్త

అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు, అలర్జీతో బాధపడేవారు, పెదాలు ఇప్పటికే పగిలిపోయి ఉన్నా, మేకప్‌ ప్రొడక్ట్స్‌ పడకపోయినా అలాంటి వారు లిప్‌స్టిక్‌ వాడే ముందు డెర్మటాలజిస్టు నిపుణుల సలహా తీసుకోవాలి. లిప్‌స్టిక్‌ వాడుతున్నప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే వెంటనే దాన్ని ఆపేయడం ఉత్తమం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, September 10, 2026, 15:37 [IST]
Desktop Bottom Promotion