Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ శరీరంలో ఈ 7 మార్పులు కనబడితే డయాబెటిస్ ఉన్నట్లే!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది డయాబెటిస్ లేదా మధుమేహం అని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో కొంతకాలంగా మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశాన్ని డయాబెటిస్‌కు ప్రపంచ రాజధానిగా పరిగణించడానికి ఇదే కారణం. మధుమేహం లేదా షుగర్ ఈ పేర్లు వింటేనే చాలామంది భయపెడతారు. ఒక్కసారి డయాబెటిస్ వస్తే జీవితాంతం నరకమే అని చాలా మంది భావిస్తుంటారు. దీనికి కారణం మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి, దీనికి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ లేదు. కొన్ని లక్షణాల నుండి సమయానికి గుర్తించడం ద్వారా దాని తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఈ కారణంగానే ప్రతి ఏటా నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేని జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రారంభ లక్షణాల సహాయంతో మీరు డయాబెటిస్ ని సకాలంలో ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

తరచుగా మూత్రవిసర్జన
మీరు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే లేదా విపరీతమైన దాహంగా అనిపిస్తుంటే అది మధుమేహానికి సంకేతం కావచ్చు. అధిక రక్త చక్కెర స్థాయిల కారణంగా ఒక వ్యక్తి తరచుగా మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది. అధిక దాహం కారణంగా కూడా మధుమేహానికి ఓ సంకేతమే.
బాగా అలసిపోవడం
అనియంత్రిత మధుమేహం ఒక వ్యక్తి ఎనర్జీ లెవల్స్ ని ప్రభావితం చేస్తుంది. దీని వలన వాళ్లు సాధారణం కంటే ఎక్కువ అలసిపోతారు.
అస్పష్టమైన దృష్టి
మీరు అస్పష్టమైన దృష్టి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని అస్సలు విస్మరించవద్దు. ఎందుకంటే ఇది మధుమేహం ప్రారంభానికి సంకేతం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. ఇతర కంటి సంబంధిత లక్షణాలు నల్ల మచ్చలు కనిపించడం లేదా కొన్నిసార్లు దృష్టి కోల్పోవడం కూడా ఈ కేటగిరీలో ఉన్నాయి.
ఆకస్మిక బరువు తగ్గుదల
ఎలాంటి శ్రమ లేకుండా మీ బరువు అకస్మాత్తుగా తగ్గిపోతుంటే దానిని అస్సలు లైట్ తీసుకోకండి. ఎందుకంటే బరువు తగ్గడం డయాబెటిస్ ప్రారంభ సంకేతం.
తరచుగా అంటువ్యాధులు
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం కూడా మధుమేహానికి సంకేతం.
చేతులు- కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి, నొప్పి
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం నరాల దెబ్బతినడానికి కారణమవుతాయి. తిమ్మిరి, జలదరింపు లేదా కాళ్లు, కొన్నిసార్లు చేతులు నొప్పికి కారణమవుతాయి.
మెడ చుట్టూ పిగ్మెంటేషన్(సాధారణంగా కంటే కూడా చర్మం మరింత నల్లగా మారడం)
ఇన్సులిన్ నిరోధకత మెడ,చంకలు, నడుము చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా అధిక రక్తంలో చక్కెర స్థాయిల వలన సంభవించవచ్చు. కాబట్టి ఎవరైనా ఈ ఏడు లక్షణాలను ముందుగానే గుర్తిస్తే సకాలంలో మధుమేహాన్ని నివారించవచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు సలహాలు తీసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications