Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Bird Flu: బర్డ్ ఫ్లూ సోకకుండా చికెన్ ఎలా తినాలో తెలుసా? వండేటప్పుడు ఈ టిప్స్ ఇంపార్టెంట్
తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు తీవ్రంగా కలవర పెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది బర్డ్ ఫ్లూ. ఏపీలో కోళ్లు ఈ వైరస్ సోకి విపరీతంగా మరణిస్తుండడంతో చికెన్ తినాలంటేనే మనుషులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ నుంచి వచ్చే కోళ్లపై నిషేధం విధించడంతో పాటు, జిల్లాల యంత్రాగాలకు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
దీంతో మాంసాహార ప్రియులు చికెన్ ముక్కలేక తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే చికెన్ వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ తింటే.. బర్డ్ ఫ్లూ సోకె ప్రమాదం చాలా తక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏవి? చికెన్‌ను ఏ విధంగా వండుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చికెన్‌ను బాగా ఉడికించాలి..
బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే చికెన్‌ను బాగా ఉడికించాలి. ఉడకని చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకె అవకాశం ఉండడంతో.. అది సోకకుండా ఉండాలంటే సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్ మాంసం ఉడికించాలి. దీంతో అందులోని వైరస్ నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చికెన్‌ను బాగా శుభ్రం చేసుకోవడం
చికెన్ ముక్కలను వండడానికంటే ముందే వాటిని బాగా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని అనవసర భాగాలను, పించాలను పూర్తిగా తొలగించుకోవాలి. దీని ద్వారా వైరస్ ప్రభావం తగ్గుతుంది. అలాగే వాటి బారిన పడే అవకాశం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
క్రాస్-కంటామినేషన్ నివారించడం:
చికెన్ తినేటప్పుడు బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే కచ్చితంగా క్రాస్-కంటామినేషన్‌ను నివారించాలి. అంటే పచ్చి మాంసాన్ని కడిగేందుకు ఉపయోగించిన గిన్నె, లేదా దానిని కట్ చేసేందుకు ఉపయోగించిన పరికరాలను మళ్ళీ వాడకూడదు. అలాగే వాటిని చేతులు, వంట సామగ్రి, ఇతర ఆహార పదార్థాలకు తగిలించకూడదు. ఇలా చేస్తే మళ్ళీ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని దూరంగా ఉంచాలి.
శుభ్రత పాటించడం:
వంట చేయడానికి ఉపయోగించే పాన్, వంట సామగ్రిని పూర్తిగా శుభ్రంగా కడిగినా, వాడిన తర్వాత కూడా, వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాటిని ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులోని వైరస్ చనిపోయి, తరువాత వాటిని వినియోగించినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.
వెన్న లేదా నెయ్యి వాడడం
ఒకవేళ మీరు చికెన్ రోస్ట్ చేస్తున్నట్లైతే వాటిపైన కచ్చితంగా నెయ్యి లేదా వెన్నను పూయండి. ఇలా చేయడం వల్ల అందులోని యాంటీ యాక్సిడెంట్లు ఫైర్‌తో కలిసి చికెన్‌పై ఉండే వైరస్‌ను నాశనం చేస్తాయి. తద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications