Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
చలికాలంలో ఈ 5 తిన్నారంటే.. రేసుగుర్రాలుగా మారిపోతారు
కరోనా తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార విషయాల్లో చాలా మార్పులే వచ్చాయి. కరోనాకి ముందు ఏది పడితే అది తినేవాళ్లు కూడా కరోనా తర్వాత నుంచి ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో ఏది హానిచేస్తుందో తెలుసుకొని వాటిని తీసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలను తీసుకునేందుకే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా సమయంలో కేవలం ఇమ్యూనిటీ లేకనే చాలామంది కరోనాబారిన పడ్డారు..కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ ఏంటో అప్పటి నుంచే సామాన్య జనాలకి కూడా బాగా అర్థం అయ్యింది.
చలికాలంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకుంటే అనేక వ్యాధులు మిమ్నల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో మెత్తని బొంతలు,దుప్పట్లు మన శరీరాన్ని బాహ్యంగా వెచ్చగా ఉంచుతాయి. అయితే అంతర్గతంగా కూడా చలికాలంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాలంటే మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవాల్సిందే. చలికాలంలో రగనిరధక శక్తిని పెంచుకోడానికి 5 సూపర్ ఫుడ్స్ తీసుకుంటే చాలు. వీటిని రోజూ తినడం వల్ల చలికాలంలో అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. చలికాలంలో ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేసే ఆ 5 ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

మిల్లెట్
మీ ఆహారంలో మిల్లెట్‌ను చేర్చుకోవడానికి శీతాకాలం బెస్ట్ టైం. మిల్లెట్ లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. మిల్లెట్స్ లో అనేక రకాలు ఉంటాయి. అయితే రాగి వంటి మిల్లెట్లలో ఉండే అమినో యాసిడ్స్ మిమ్మల్ని చాలా సమయం పాటు మిమ్మల్ని నిండుగా ఉంచుతాయి. ఈ సీజన్‌లో దీన్ని మీ ఆహారంలో కూడా భాగం చేసుకోవచ్చు.
ఆకు కూరలు
బచ్చలికూర, ముదురు ఆకు కూరలు శీతాకాలంలో తప్పక తీసుకోవాలి. ఇది తక్కువ కేలరీల ఆహారం మాత్రమే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్, రోగనిరోధక శక్తిని ప్రేరేపించే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపర్చడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వంటి అనేక విధాలుగా ఈ పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.
బెల్లం
సాధారణంగా చలికాలంలో బెల్లం తినాలని మన ఇళ్లల్లో పెద్దలు చెబుతూ ఉండటం చూసి ఉంటాం. వింటర్ లో బెల్లం తినడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలే ఉంటాయి. బెల్లంలో జింక్, సెలీనియం వంటి అనేక పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. చలికాలంలో మీ రోజువారీ ఆహారంలో బెల్లంను కూడా భాగం చేసుకోవడం ద్వారా మీ జిర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
నెయ్యి
నెయ్యి అనేది ఏ సీజన్ లో అయినా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండేదయినప్పటికీ చలికాలంలో రోజూ ఆహారంలో దీనిని తప్పక చేర్చుకోవాలి. అన్నం,పప్పు, రోటి పచ్చడి, కూరలకు నెయ్యిని జోడించి తినవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో ఓ చెంచా దేశీ నెయ్యి కలుపుకొని ఉదయాన్నే తాగవచ్చు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
ఖర్జూరం
ఖర్జూరం తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజానాలను అందిస్తుంది. ఇందులో శరీరానికి మేలు చేసే విటమిన్స్,పోషకాలు,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా కీళ్లనొప్పుల వంటి వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. చలికాంలో ఖర్జూరం తినడం వల్ల మన బలం పెరుగుతుంది..అలసట,బలహీనత నుంచి మనల్ని కాపాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











