Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మాంసం తింటే కొత్త రోగం.. చేతులు ఇలా మారిపోతున్నాయట,ఎలా గుర్తించాలంటే?
రోజు రోజూ మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా ప్రతిరోజూ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అసలు కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయో కూడా అర్ధంకానీ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మరీ ముఖ్యంగా కరోనా తరువాత ఎలాంటి చిన్న వ్యాధి వచ్చినా ప్రజలందరూ కంగారు పడిపోతున్నారు. అయితే మన శరీరంలో ఉండే కొవ్వు కారణంగా కూడా అనేక సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే.
అయితే, అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి శరీరంలో నుంచి కొవ్వు లీక్ అవుతుందట. ఈ విస్మయకరమైన మార్పులను చూసి, ఆందోళన చెందిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాడు. దీంతో వైద్యులు అతనికి దానికి సంబంధించిన ఆందోళనతో వైద్యులను సంప్రదించాడు.

చేతులు, కాళ్ల ద్వారా కొలెస్ట్రాల్ లీక్ అవడం:
జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం అమెరికాకు చెందిన ఒక 40 సంవత్సరాల వ్యక్తి తన శరీరంలో పసుపు రంగు ఛాయలను గమనించాడు. అయితే అతను మొదటగా సాధారణమైనవే అని అనుకున్నాడు. కానీ కొద్దీ రోజుల తరువాత అవి మరింత పెరిగిపోయాయి. దీంతో ఆ వ్యక్తి టంపా జనరల్ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యులను సంపాదించారు. దీంతో అతడిలో విచిత్రమైన ఆరోగ్య పరిస్థితిని కనుగొన్నారు.
వైద్యులు ఏం చెప్పారు?
ఆయన పూర్తి మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తరువాత, వైద్యులు అతనిలో అత్యధిక స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల ఈ సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. అతను అనుసరించిన కీటోజెనిక్ డైట్ కారణంగా, శరీరంలో ఎక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ పెరిగాయి. దీంతో అతని శరీరం నుంచి కొవ్వు పదార్థాలు లీక్ అవడం ప్రారంభమవుతుందని చెప్పారు.
కొలెస్ట్రాల్ ప్రభావం
అతనికి చర్మంలో పసుపు రంగు ఛాయలు కనిపించినప్పటికీ, వైద్యులు ఈ లక్షణాలను "క్శాంథెలాస్మా"గా నిర్ధారించారు. ఇది శరీరంలోని కొవ్వు నిల్వలు.. చర్మం కింద ఉత్పత్తి కావడం వల్ల ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైనది కాదు, కానీ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఈ రుగ్మతలో, కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గిపోతుంది, ఇది గుండె జబ్బులకు, ఇస్కీమిక్ స్ట్రోక్ లాంటి తీవ్రమైన పరిస్థితులకు కారణం కావచ్చు.
మాంసాహారం యొక్క ప్రమాదాలు:
హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, ఎక్కువ కాలం మాంసాహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, బోలు ఎముకల సమస్యలు, మూత్రపిండాల పనితీరు తగ్గడం వంటి సమస్యలకు కారణం అవుతుంది. మాంసాహారం ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ, అది ఎక్కువ మోతాదులో, ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన జబ్బులు కూడా రావచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications