Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
జంక్ ఫుడ్ తింటూనే ఫిట్ గా ఉండటం ఎలా? ఈ టిప్స్ తెలిస్తే ఎంత తిన్నా పొట్ట రాదు!
ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఇష్టపడనివారు చాలా తక్కువమందే ఉంటారు. ఇంట్లొ ఆరోగ్యకరమైన ఆహారం రెడీ చేసి పెట్టానా కూడా సాయంత్రం అలా సరదాగా రోడ్డు సైడ్ షాపులో లేదా బండ్లమీద ఎగ్ రైస్, పానీపూరీ, చికెన్ పకోడీ అంటూ ఇలా రకరకాల చిరుతిళ్లు తింటుంటారు. కొందరు అయితే అర్థరాత్రి ఇంట్లో నుంచి లేచి వెళ్లి మరీ రకరకాలు చిరుతిళ్లను ఆస్వాదిస్తుంటారు. ఆరోగ్యానికి అది ఎంత ఎఫెక్ట్ అనేది ఆలోచించకుండా పొట్ట పట్టినదాకా తినేసి వస్తుంటారు. అయితే బరువు తగ్గాలుకున్నప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతుంది.
కొందరు జంక్ ఫుడ్ ఎంత తిన్నారా బరువు పెరగరు. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా. అయితే దీని వెనుక పెద్ద మ్యాజిక్ ఏమీ ఉండదు. కాకపోతే వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తారు. మీరు కూడా ఎంత జంక్ ఫుడ్ తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే 5 టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

8వేలకు పైగా అడుగులు
ప్రతిరోజూ మనం నడవడం,కదలడం, నిలబడటం వంటి పనులు చేయడం ద్వారా మన శరీరం 10 నుంచి 15శాతం కేలరీను ఖర్చు చేస్తుంది. ప్రతిరోజూ 8వేలకు పైగా అడుగులు వేయాలని, లిఫ్ట్ వాడటం మానేసి మెట్లు ఎక్కాలని, ప్రతి గంటకు కదలాలని.. నిలబడి పనిచేయాలని..మాట్లాడుతూ నడవాలని లైఫ్ స్టైల్ కోచ్ అను త్రిపాఠి ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.
ఖాళీ కడుపుతో జంక్ ఫుడ్ వద్దు
ఖాళీ కడుపుతో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తర్వాత తగ్గిపోతాయి. ఇది కొవ్వు నిల్వకు, ఆకలి పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ తినే ముందు జంక్ తినే ముందు గుప్పెడు బాదం లేదా సలాడ్ తినండి. లేదంటే ప్రోటీన్, ఫైబర్ (గింజలు, పెరుగు, ఉడికించిన గుడ్డు) తినాలని అను త్రిపాఠి తెలిపారు.
బరువులు ఎత్తాలి
కండరాలు కొవ్వు కంటే 3 రెట్లు ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తాయి. ఎక్కువ కండరాలు అంటే ఎక్కువ జీవక్రియ, అంటే వేగంగా కొవ్వు కరుగుతుంది. వారానికి 3-4 సార్లు బరువు శిక్షణపై దృష్టి పెట్టండి. స్క్వాట్స్, పుష్-అప్స్ వంటి వ్యాయామాలు చేయండి.
స్మార్ట్ ఫుడ్
రక్తంలో చక్కెర పెరగడం కొవ్వు నిల్వకు, ఆకలికి, జీవక్రియ నెమ్మగించడానికి దారితీస్తుంది. ప్రోటీన్, ఫైబర్ తో కార్బోహైడ్రేట్ లను కలిపి తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను ఒంటరిగా తినవద్దు. ప్రోటీన్ లేదా ఫైబర్‌తో కలిపి తినండి.
నీరు తాగడం
డీహైడ్రేషన్ జీవక్రియను తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ప్రతిరోజూ 2.5-3 లీటర్ల నీరు త్రాగండి. గోరువెచ్చని జీలకర్ర నీటితో రోజు ప్రారంభించండి. జీలకర్ర లేదా అల్లం నీరు తాగండి. ఈ చిట్కాలను పాటిస్తే మీరు జంక్ ఫుడ్ తిన్నా బరువు పెరగకుండా ఉంటారని అను త్రిపాఠి తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications