Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
పచ్చి వెల్లుల్లి పవర్..ఉదయం లేవగానే ఇలా చేస్తే భయంకరమైన వ్యాధులు మాయం!
మన వంటిల్లే పెద్ద మెడికల్ షాప్ అని పెద్దలు ఊరకనే అనలేదు. మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే అనేక దినుసుల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అందులో ముఖ్యమైనది వెల్లుల్లి. ఘాటైన వాసన, ప్రత్యేకమైన రుచిని అందించే వెల్లుల్లి కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది.
అయితే వెల్లుల్లిని కూరల్లో వేయించి తినడం కంటే పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందికి వెల్లుల్లి మంచిదని తెలిసినా కూడా ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే విషయాల్లో గందరగోళం ఉంటుంది.

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం పచ్చి వెల్లుల్లిని ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవడం అత్యంత ప్రయోజనకరం. ఉదయాన్నే మన జీవక్రియ చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో వెల్లుల్లిని తీసుకుంటే శరీరం ఇందులోని ఔషధ గుణాలను పూర్తిగా గ్రహించగలుగుతుంది.
ప్రతిరోజూ ఉదయం కేవలం రెండు వెచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగడం లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు
గుండెకు రక్షక కవచం
పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, రక్త నాళాలు గట్టిపడకుండా కాపాడటానికి సహాయపడుతుంది. గుండె పదిలంలో ఉండాలంటే రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవడం తప్పనిసరి.
కొలెస్ట్రాల్ ను కరిగించే ఆయుధం
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అనేక అనారోగ్యాలకు మూలం. పచ్చి వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
అదే సమయంలో శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులను నివారిస్తుంది.
రోగనిరోధక శక్తికి బూస్టర్
చిన్నపాటి వాతావరణ మార్పులకే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు సాల్మొనెల్లా, ఇ కోలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలతో పోరాడి మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి.
మధుమేహ బాధితులకు దివ్యౌషధం
డయాబెటిస్ తో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరం. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చూస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
