రాత్రి వేళలో సలాడ్ లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అనేందుకు 5 ప్రధాన కారణాలు...

Eating Salad At Night: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి తినే తిండి మీద శ్రద్ధ ఉండడం లేదు. ఏది దొరికితే అది తినేయడం తర్వాత అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం.. ఇది పరిపాటిగా మారింది. అయితే చాలామంది తమ ఆహారంలో ఎక్కువగా సలాడ్ లను తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం.

సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి వారు పూర్తిగా శాఖాహారులై ఉండాలి లేదంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిర్ణయానికి అయినా రావాలి. తినే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలనే ఆలోచనతో ఈటింగ్ డిజార్డర్ కి లోనవుతున్నారు. అసలు రాత్రి వేళల్లో సలాడ్ లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా...?

Eating Salad At Night

రాత్రి సమయంలో ఏదైనా తినాలనుకుంటే ఎక్కువ శాతం మంది ఫ్రెష్ వెజిటేబుల్ సలాడ్స్ ను ఎంచుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా పోషకాల విలువలు ఉండడం ఒక కారణమైతే, డైట్ మెయింటైన్ చేయడం మరో కారణం.అసలు రాత్రి సమయంలో సలాడ్ లను, పండ్లను ఎందుకు తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు?

మామూలుగా సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత వేడి చేయని పదార్థాలను తినడం మంచిది కాదని న్యూట్రీషియన్స్ సలహాలు ఇస్తున్నారు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక పద్ధతిని ఫాలో అవుతూ ఉంటుంది. ఇది ఉదయం సమయంలో చురుకుగాను రాత్రి సమయంలో నెమ్మదిగాను పనిచేస్తూ ఉంటుంది.

ఉడికించని ఆహార పదార్థాలను డైజెస్ట్ చేయడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, అలాగే ఇది కష్టతరం కూడా. ఒకవేళ డైజెషన్ అనేది సరిగ్గా జరగకపోతే కడుపులో ఎసిడిటీ ఫామ్ అవుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యల తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఇది నిద్రపైన ప్రభావం చూపి ఉదయం మేలుకోవడం కూడా కష్టతరం అవుతుంది.

రాత్రి వేళలో సలాడ్ లు తినకూడదు అని చెప్పడానికి ఐదు ప్రధాన కారణాలు....!

1. డైజేషన్ సమస్యలు:

జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రాలజీ అధ్యయనం ప్రకారం... ఆహారంతో సంబంధం లేకుండా రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం ద్వారా డైజేషన్ సమస్య తలెత్తుతుంది. దీని వెనకాల ప్రధాన కారణం మనం నిద్రపోయే సమయంలో డైజేషన్ సిస్టం అనేది నెమ్మదిగా ఉండడం. ఈ కారణంగా గుండెల్లో మంట, లేనిపోని అసౌకర్యం, అజీర్ణం తలెత్తుతాయి. అలాగే డైజెస్టివ్ సిస్టం అనేది రాత్రి సమయంలో తక్కువ స్థాయిలో ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్లను రిలీజ్ చేస్తుంది. ఈ కారణంగా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు నిద్రలేని సమస్యలు కలుగుతాయి.

2. బ్లడ్ షుగర్ పెరుగుదల:

జర్నల్ డయాబెటిస్ కేర్ ప్రచురించిన కథనాలు ప్రచారం రాత్రిపూట ఆలస్యంగా తిన్న, ఆరోగ్యకరమైన సలాడ్లు తిన్న కూడా బ్లడ్ లో షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఈ కారణంగా నిద్రలో అవంతరాలు ఏర్పడడం అలాగే టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే నిద్రపోయే సమయంలో బ్లడ్ షుగర్ ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. ఈ కారణంగా మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కూడా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

3. నిద్రకు ఆటంకం:

స్లీప్ మెడిసిన్ ప్రచురించిన జర్నల్ లో కథనం ప్రకారం రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ద్వారా నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా నిద్రపోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ పడుకున్నా కూడా ఉదయం లేచేటప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నిద్రపోయే ముందు తినడం ద్వారా డైజెస్టివ్ సిస్టం అనేది యాక్టివ్ గా ఉండి నిద్రపోకుండా మెలకువగా ఉంచుతుంది. దీనికి తోడు అదనంగా అరుగుదల సమస్య లేదా గుండెల్లో మంట తదితర సమస్యలు ఎదురై నిద్రకి ఆటంకాన్ని కలిగిస్తాయి.

4. క్యాలరీలు పెరుగుదల:

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబిసిటీ కథనం ప్రకారం రాత్రి వేళలో ఆలస్యంగా తినడం ద్వారా అధిక మొత్తంలో కేలరీలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి సమయంలో మామూలుగా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలిసిపోయి ఉండటం వల్ల ఎక్కువగా తినడం లేదంటే అనుకున్న వాటి కంటే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కేలరీలు పెరిగి తెలియకుండానే శరీర బరువు పెరుగుతుంది.

5. అనారోగ్యకరమైన డ్రెస్సింగ్ ఎంపికలు:

మనం రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన సలాడ్ లు తీసుకున్న కూడా...డ్రెస్సింగ్ అనేది మొత్తం మనం తీసుకునే ఆహారంకి సంబంధించిన పోషక విలువల్లో కీలకపాత్ర పోషిస్తుంది. పబ్లిక్ హెల్త్ న్యూట్రీషియన్ జర్నల్ ప్రచూరించిన కథనాల ప్రకారం అధిక మొత్తంలో షుగర్లు,కొవ్వు పదార్థాలు ఉండే డ్రెస్సింగ్ ల వల్ల ఉబకాయం లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాన్ని తెలిపింది. మనం తినే ఆహారంలో అనారోగ్యకరమైన డ్రెస్సింగ్ లను ఎంచుకోవడం ద్వార సలాడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు సైతం పక్కదారి పడతాయి. దీని కారణంగా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

వీటన్నిటిని అధిగమించాలంటే వీలైనంత త్వరగా రాత్రి సమయంలో భోజనాన్ని పూర్తి చేసుకోవాలి. తద్వారా మంచి నిద్ర అలాగే మంచి ఆరోగ్యం దొరుకుతాయి. ఒకవేళ ఆలస్యంగా తినవలసిన పరిస్థితి ఏర్పడితే సలాడ్స్ కన్నా తేలికగా ఉండే పండ్లు లేదా పెరుగు అన్నం తినడం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, March 7, 2024, 10:00 [IST]
Desktop Bottom Promotion