Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎప్పుడూ యవ్వనంగా వుండాలంటే.. వీటిని తినడండి..ముడతలు మటుమాయం..!
యవ్వనంగా కనిపించడానికి చాలా మంచి చాలా కష్టాలు పడతారు. పురాణాల్లో అయితే యవ్వనంగా కనిపించడానికి చాలా తపస్సులు చేశారు. బయటి అందానికన్నా లోపల అందానికి ఎక్కువ విలువ వుంటుంది. లోపల అంటే మనసు మాత్రమే కాదు శరీరం కూడా. శరీరం లోపల ఆరోగ్యంగా వుంటేనే బయట యవ్వనంగా కనిపిస్తామని అర్ధం. కొన్ని ఆహార పదార్ధాలను తినడం వల్ల యవ్వనంగా కనిపించే అవకాశాలు వున్నాయ్. ఆ ఆహారా పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదాం
2021లో జరిపిన పరిశోధనల ప్రకారం చర్మంపై ముడతలను తగ్గించే పోషకాలు బాదాంలో వున్నాయని తేల్చారు. ఈ పరిశోధనలో మహిళలు రోజుకు రెండు పిడికెల బాదాంలను ఆరు నెలలపాటు తీసుకున్నారు. దీంతో అనుకున్న ఫలితం కనిపించింది. చర్మం కాంతివంతంగా ముడతలు లేకుండా తయారైంది. రోజూ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్ ఈ కూడా బాదాంతో అందుతాయ్.
క్యారెట్లు
క్యారెట్లలో క్యారటినాయిడ్లు అధికంగా వుంటాయ. ఈ క్యారటినాయిడ్లు ఎక్కువగా వుంటే ముఖం ఆకర్షనీయంగా కనబడుతుందని బిహేవియరల్ ఎలాలజీలో తేలింది.
స్ట్రాబెర్రీ
స్ట్రా బెర్రీల్లో యాంతో సియానిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వున్నాయ్. వయసు పెరుగుతున్నా కొద్ది యముకలు కోల్పోకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయ్. దీంతో యవ్వనంగా కనిపిస్తాం.

టమాట
టమాటో వుండు లైసోపీన్ పిగ్‌మెంట్ గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ లైసోపీన్ న్యాచురల్ సన్‌స్క్రీన్‌గా కూడా పని చేస్తుంది. ఎండలో వచ్చే యూవీ కిరణాల నుంచి కూడా ఈ లైసోపీన్ కాపాడుతుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా వుంటుంది. ఈ మోనోసాచురేటెడ్ ఫ్యాట్‌ను అధికంగా తీసుకున్న వారిలో ముడతలు తక్కువగా వచ్చినట్లు కనిపించాయ్. కూరగాయలు, పప్పులు ఎక్కువగా తిన్నవారికి కూడా ముడతలు తక్కువగానే వచ్చినట్లు కనుగ్గొన్నారు.
అవొకాడో
అవొకాడోలో మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వుండడం వల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది. వైటమిన్ ఈ పుష్కలంగా వుండడం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా వుండడం వల్ల స్కిన్ సెల్స్ ఆరోగ్యంగా వుంటాయ్.
నీళ్లు
నీళ్లు ఎక్కువగా తాగడం యవ్వనానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక పరిశోధనలో యువతులతో ప్రతీ రోజు రెండు లీటర్ల నీళ్లు తాగించారు.
గ్రీన్ టీ
రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా వుంటుందని కనుగ్గొన్నారు. గ్రీన్ టీలో ఈసీజీసీ అనే యాంటీ ఆక్సిడెట్లు ఎక్కువగా వుండడం వల్ల చర్మం ఆరోగ్యంగా వుంటుంది.
వెజిటేబుల్ సూప్
రోజూ ఒక బౌల్ వెజిటేబుల్ సూప్ తాగితే చర్మం మాత్రమే కాదు వెంట్రుకలు, గోళ్లు కూడా ఆరోగ్యంగా వుంటాయ్. కొన్ని రోజులు వయసు మీద పడిన మహిళలతో ఈ సూప్‌ను తాగించినప్పుడు వారి చర్మంలో ముడతలు తగ్గినట్లు పరిశోధనలో తేలింది.
కాజూ
కాజు తినడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా వుంటుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా వుండడంతో పాటు జింక్ పోషకాలు కూడా మెండుగా వుండడం చర్మం ఆరోగ్యంగా కనబుతుంది.
కివి
కివి ఫ్రూట్ తినడం వల్ల కూడా చర్మంపై ముడతలు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. 2013లో జరిపిన పరిశోధనలో తక్కువ నిద్రపోయిన వారికి చర్మంలో ముడతలు వచ్చినట్లు తెలుసుకొని వారితో ప్రతీ రోజూ కివి పళ్లను తినిపించడం వల్ల ముడతలు తగ్గినట్లు తులింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications