Latest Updates
-
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
కోడిగుడ్డు పెంకులను పారేస్తున్నారా?.. పెంకులతో ఇలా చేస్తే అమ్మాయిలందరూ మీ వెంటే ఉంటారు!
కోడిగుడ్లతో మనం తరచూ ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తింటూ ఉంటాము. కొన్నిసార్లు గుడ్లను ఉడకబెట్టుకొని తింటాం. ఈ క్రమంలో కోడి గుడ్లను పగలగొట్టి పెంకులను పారేస్తుంటాము. అయితే కోడిగుడ్డులోనే కాకుండా పెంకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. కోడి గుడ్డు పెంకులతో చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కోడిగుడ్లతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? పెంకులను పారేయకుండా ఎలా వినియోగించుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మ సౌందర్యానికి..
కోడిగుడ్ల పెంకులతో చర్మ సౌందర్యానికి సంబంధించిన కొన్ని క్రీమ్స్ అలాగే ఆయిల్ తయారు చేస్తారు. కోడిగుడ్ల పెంకుల్లో మెంబ్రేన్, క్యాల్షియం, ప్రోటీన్ సహా ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. దీనివల్ల చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పెంకులు చర్మానికి మెరుపును పెంచడం, ముడతలు, మచ్చలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. రంధ్రాలు పూడిపోయేలా చేయడంతో పాటు మరెన్నో చర్మానికి సంబంధించిన లాభాలు ఉంటాయి.

మచ్చలు తగ్గించుకునేందుకు..
కోడిగుడ్డు పెంకులను పొడిగా చేసుకొని.. దానిలో తేనె కలుపుకొని ఫేస్‌ప్యాక్‌లగా వేసుకుంటే చర్మంపై ఉండే మచ్చలను తొలగించుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. కోడి గుడ్డు పెంకులను ముందుగా పొడిగా చేసుకోవాలి. దానిని ఒక కప్పులో తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలుపుకొని పేస్ ప్యాక్‌లాగా చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. అది ఆరిపోయేవరకు ఉంచుకొని.. చల్లటి నీటితో కడుక్కోవాలి. వారానికి ఒకసారి ఇలా పేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉండే మచ్చలను తొలగించుకోవచ్చు.
వాపులు తగ్గించుకునేందుకు..
సాధారణంగా కొందరికి చర్మం వసిపోయినట్లు కనిపిస్తుంటుంది. అలాగే కొంచెం ముద్దగా కనిపిస్తుంటుంది. అలాంటి వారికి కోడిగుడ్లు పెంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని కోడిగుడ్ల పెంకులను పొడిగా చేసుకొని అందులో యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని మంచిగా ఒక పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దూదితో ముంచి ముఖంపై రాసుకోవాలి. అది ఆరిపోయేవరకు ఉంచుకొని చల్లని నీటితో కడుక్కోవాలి. అది చర్మంపై వాపును, మంటను తగ్గిస్తుంది.
డెడ్ స్కిన్ తొలగించుకోవడానికి..
చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలగించుకోవడానికి కోడి గుడ్డు పెంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కోడిగుడ్ల పొడిలో రెండు టేబుల్ స్పూన్ల చెక్కెరతో పాటు కోడిగుడ్డులోని సొనను కూడా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో చర్మంపై స్క్రబ్ చేసుకోవాలి. అనంతరం ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. అనంతరం వేడి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే చర్మపై ఉండే డెడ్ స్కిన్ అంతా తొలిగిపోతాయి.
ముడతలు, మచ్చలు మాయం..
ముఖంపై, చర్మంపై ఉండే ముడతలు మచ్చలు ఒక వ్యక్తిని చాలా వయసు ఉన్న వ్యక్తిలా కనిపించేలా చేస్తాయి. అలాంటి మచ్చలు, ముడతలను తొలగించుకోవడానికి కోడిగుడ్ల పెంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా కోడిగుడ్డు పెంకులను పొడిగా చేసుకోవాలి. దానిని ఓ గిన్నెలో వేసుకొని ఆ పొడిలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం చూర్ణాన్ని వేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అనంతరం ముఖం మొత్తం దానిని రాసుకోవాలి. అనంతరం 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే మడతలు, మచ్చలు వంటి సమస్యలు తొలిపోతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











