Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటీ, అది ఎందుకు వస్తుంది, చికిత్స ఏమిటి?
మనదేశంలో ఏటా లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ధనవంతుల జబ్బు అని భావించేటోళ్లు. అయితే క్యాన్సర్ కు ఎవరు అతీలులు కాదు. గతంలో క్యాన్సర్ అంటే మరణం ఖాయం అని వణికిపోయేటోళ్లు. అయితే క్యాన్సర్ కు ఇప్పుడు అత్యాధునిక ట్రీట్మెంట్ప్ అందుబాటులోకి రావడంతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తగ్గిపోతుంది. క్యాన్సర్ ను జయించిన వారు చాలామందే ఉన్నారు. అయితే దీనిని ప్రాధమిక దశలోనే గుర్తించడం ముఖ్యం..అప్పుడే దీనికి చెక్ పెట్టవచ్చు.
క్యాన్సర్లలో అనేక రకాలు ఉంటాయి. అందులో గర్భాశయ క్యాన్సర్ ఒకటి.దీనిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది మహిళల పునరుత్పత్తి వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే దాని నుండి సురక్షితంగా ఉండటం సాధ్యపడుతుంది.

గర్భాశయ క్యాన్సర్ సమస్యలు
గర్భాశయ క్యాన్సర్ ను సకాలంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోతే వివిధ సమస్యలు సంభవించవచ్చు. ఇది స్త్రీ ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది అండాశయాలు, ఫెలోపియన్ గొట్టాలు లేదా మూత్రాశయం వంటి అవయవాలకు వ్యాపిస్తుంది. ఇది వ్యాధికి ట్రీట్మెంట్ చేయడం కష్టతరం చేస్తుంది. ప్రేగు, మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల మూత్రవిసర్జన, మలవిసర్జనలో సమస్యలు వస్తాయి. నొప్పి, అసౌకర్యం ఇది స్త్రీ సాధారణ జీవనశైలికి ఆటంకం కలిగిస్తుంది. కాలేయం, ఊపిరితిత్తుల వంటి సుదూర అవయవాలకు వ్యాపించడం ప్రాణాంతకం కావచ్చు.
ఎందుకు వస్తుంది
గర్భాశయ క్యాన్సర్ ఎండోమెట్రియల్ కణాల అనియంత్రిత పెరుగుదల వల్ల వస్తుంది.
రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, రుతుక్రమం ఆగిపోయిన వాళ్లకి.. పునరుత్పత్తి సంవత్సరాల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు.. క్రమరహిత పీరియడ్స్ ఉన్నవారు... 40 ఏళ్ల తర్వాత ఋతుస్రావం ఎక్కువగా ఉన్నవారు... వంధ్యత్వం ఉన్నవారు.. అధిక బరువు ఉన్నవారు.. కుటుంబ చరిత్ర క్యాన్సర్ ఉన్నవారికి దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ థెరపీ తీసుకుంటున్నవారు... రొమ్ము క్యాన్సర్‌కు టామోక్సిఫెన్ తీసుకుంటున్నవారు.. గతంలో ఏదైనా క్యాన్సర్ కు RT తీసుకున్నవారు.. చిన్న వయసులోనే ఋతుస్రావం ప్రారంభమై ఆలస్యంగా మెనోపాజ్ ఉన్నవారు కూడా ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు
రుతువిరతి తర్వాత యోని రక్తస్రావం..దుర్వాసనతో కూడిన స్రావం (రుతువిరతి తర్వాత).. పొత్తి కడుపు నొప్పి దీని లక్షణాలుగా ఉంటాయి.
ట్రీట్మెంట్
ప్రారంభ దశలలో గర్భాశయ శస్త్రచికిత్స (సాధారణ, రాడికల్), కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ, Fmnero థెరపీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications