Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కిస్మిస్ మ్యాజిక్..ఖాళీ కడుపుతో తింటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా..
ఎండుద్రాక్ష దీనినే కిస్మిస్ అని కూడా అంటారు. ద్రాక్ష పండ్లను ఎండబెట్టడం ద్వారా తయారయ్యే ఒక తీపికరమై పదార్థం ఇది. ఇది కేకులు, స్వీట్లు,పాయసం వంటి వంటకాలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. చిన్నగా కనిపించినా, ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతుంటారు.
అయితే పొద్దున్నే ఖాళీ కడుపుతో కిస్మిస్ తింటే ఇంకా చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో 5 ఎండుద్రాక్షలకు మించి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్ష తియ్యగా ఉన్నప్పటికీ,అవి తక్కువ GI(గ్లైసెమిక్ ఇండెక్స్) కలిగి ఉంటాయి. పరిశోధన ప్రకారం అవి రక్తంలో షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి, ఇది షుగర్ పేషెంట్లకు కూడా మంచి ఎంపికగా మారుతుంది.

-ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. పొద్దున్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
-కిస్మిస్ లో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి, ఇవి తక్షణ శక్తిని(Instant Energy) అందిస్తాయి. ఇది అలసటను కూడా తగ్గిస్తుంది.
-ఎండుద్రాక్షలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది, ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది, కేలరీల తీసుకోవడం కూడా తగ్గుతుంది.
-ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సి ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి చర్మ కాంతిని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
-5 ఎండుద్రాక్షలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ఇది పోషకాల శోషణను పెంచుతుంది, అవి జీర్ణం కావడానికి సులభతరం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications