యంగ్ ఏజ్ లో శృంగారం చేయడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయా? లక్షణాలు, వ్యాక్సిన్: సీనియర్ డాక్టర్

Cervical Cancer Symptoms సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ అంటే ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఈ క్యాన్సర్ బారీన పడుతున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఎందుకు ఈ క్యాన్సర్ ఇంతగా పెరిగిపోతుంది. రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? వస్తే చికిత్స తీసుకునే మార్గాలేమిటి? దీన్ని నయం చేసుకోవచ్చా? దీని గురించి ఈ రోజు మనకు అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా ద్వారా తెలుసుకుందాం..

సర్వైకల్ క్యాన్సర్ గురించి మీరు చాలా మందికి అవగాహన కల్పిస్తున్నారు? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఎనిమిది మందిలో ఒక స్త్రీ ఈ క్యాన్సర్ బారీన పడుతున్నారు, ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది?

Gynecologist Explains All About Cervical Cancer Symptoms

సర్వైకల్ క్యాన్సర్ శృంగారం చేయడం వల్ల వచ్చే క్యాన్సర్. మనకు తెలుసు మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళైన తర్వాత భార్యభర్తలు రతిలో పాల్గొనే వారు. కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో నాదగ్గరికి వచ్చే సింగల్ ఉమెన్ ను నేను అడుగుతాను మీరు సింగిలా? మ్యారిడా? రిలేషన్ షిప్ లో ఉన్నారా ?అని. సింగిల్ అయితే రిలేషన్ షిప్ ఉందా? లేదా వర్జినా అని అడుగుతాను.

ఎందుకంటే వర్జిన్స్ ను వజైనల్ ఎక్సామినేషన్ చేయము. రిలేషన్ షిప్ లో ఉంటే చేయవచ్చు. ఇదే సింపుల్ కాన్సెప్ట్. ఇందులో వేరే ఏ ఉద్దేశము ఉండదు. అయితే ప్రతి వంద మంది సింగిల్ ఉమెన్ లో 99 శాతం రిలేషన్ షిప్ లో ఉంటున్నారు.

వారిని అడిగే ప్రశ్నల్లో మొదటి సారి ఎప్పుడు శృంగారం జరిగింది అనిడిగితే వారి ద్వారా వచ్చే సమాధానం 17 లేదా 18 ఏళ్ళ వయస్సు. ఇది వాస్తం.

ఫియర్ ప్రెజర్ యంగ్ ఏజ్ లో శృంగారం

కొంత మంది ఫియర్ ప్రెజర్ తో చేస్తున్నారు. కాలేజికి వెళ్ళే అమ్మాయిలు ఒకరిని చూసి మరొకరు ఇలా చేస్తుంటారు. అమ్మాయిల్లో శృంగారం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే చదువు కెరీర్ అని 30 ఏళ్ళ వరకు పెళ్ళి చేసుకోకపోవడం వల్ల , వాళ్ళ హార్మోన్సు ప్రభావం వల్ల వాళ్ళ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు.

ఈ ఏజ్ లో వాళ్ళు చేసే తప్పుల వల్ల, ఎదుటి వ్యక్తి ఎంత మందితో కలిసారు అన్న విషయం తెలిదీ. కాబట్టి, శృంగారం సమయంలో మన శరీరంలోకి ప్రవేశించే హెచ్ పివి అనే వైరస్ ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇప్పటికే పరిశోధన ద్వారా 150 రకాల హెచ్ పివి వైరస్ రకాలున్నాయని చెబుతున్నారు. కాబట్టి మనం ఎంత మందితో శృంగారం చేస్తే అన్నిరకాల వైరస్ లు మన శరీరంలో ప్రవేశిస్తాయి.

యంగ్ ఏజ్ లో శృంగారం చేయడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయా?
ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా మన శరీరంలో ఎన్ని వైరస్ లు ఉన్నాయన్నది ముఖ్యమైన విషయం.

Cervical Cancer Symptoms

సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి?

సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి అంటే మీరు ఇప్పటికే క్యాన్సర్ 3వ స్టేజ్ లో ఉన్నారు అని అర్థం.

ఏ క్యాన్సర్ అయినా 1st and 2nd స్టేజ్ లో లక్షణాలు కనిపించవా?

గర్భాశయ క్యాన్సర్ లో కనిపిస్తాయి. రక్తశ్రావం అవుతుంది. పీరియడ్ పీరియడ్ కు బ్లీడింగ్ అవుతుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ కు లక్షణాలు ఉండవు. లక్షణాలు ఉన్నాయి అంటే అక్కడ పుండు ఏర్పడిందని అర్థం. అప్పటికే చాలా ఆలస్యం అయిందని అర్థం.

మొదటి స్టేజ్ లో ఒక లక్షణం కూడా ఉండదు. వాస్తవానికి మొదటి లక్షణం నేనుకూడా కనపెట్టలేను. ఎందుకంటే అది మైక్రోస్కోప్ కిందే కనిపెట్టగలం. కాబట్టి శృంగారం మూలంగా వచ్చే ఈ క్యాన్సర్ నుండి కాపాడుకోవడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికే శృంగారం ప్రారంభించి ఉంటే పాప్‌స్మియర్‌ అనే ఒక టెస్ట్ ఉంది. శృంగారం చెయ్యకముందు వ్యాక్సిన్ తీసుకున్నా లేదా చేసిన తర్వాత మూడేళ్ళకొకసారి పాప్‌స్మియర్‌ టెస్ట్ ప్రతి 3ఏళ్ళకొకసారి చేయించుకున్నా ఈ క్యాన్సర్ రాదు.

వ్యాక్సిన్ ఏ వయస్సులో తీసుకోవాలి? ఎన్నిసార్లు తీసుకోవాలి?

వ్యాక్సిన్ అనేది చిన్న పిల్లలికి ఇస్తాము. కాబట్టి, 10th క్లాస్ దాటక ముందే ఆడ, మగ పిల్లలకి రెండు వ్యాక్సిన్లు వేయించాలి. తర్వాత ఏం చేసినా వారికి కావాల్సినంత రక్షణ కల్పిస్తుంది. కొంతమంది ఆల్రెడి రిలేషన్ షిప్ లో ఉంటే వ్యాక్సి వేయించుకుంటే పనిచేస్తుందో లేదో అనుమానం ఉంటే, మూడేళ్ళకొకసరి పాప్‌స్మియర్‌ అనే చిన్న టెస్ట్ చేయించుకోండి. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే మూడేళ్ళకు ముందు పాప్‌స్మియర్‌ టెస్ట్ క్యాన్సర్ రాబోతుందని చెప్పేస్తుంది.

ప్యాప్సియర్ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చా?

ప్రతి స్త్రీ ఈ టెస్ట్ ను ఖచ్చితంగా చేయించుకోవాలి. శృంగారం ఒక్కసారి చేసినా వందసార్లు చేసినా వైరస్ శరీరంలో రావచ్చు. కాబట్టి ఈ టెస్ట్ ప్రతి మహిళ ప్రతి మూడేళ్ళకొకసారి చేయించుకోవాలి.

శరీరంలోకి ఈ హెచ్ పివి ప్రవేశించిన తర్వాత ఎన్నాళ్ళకు క్యాన్సర్ గా మారుతుంది?
10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది.

3వ స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనబడుతాయి?

గర్భసంచి క్రింది భాగంలో లేదా వజైనా పైన ట్యూమర్ కానీ పుండు కానీ పడుతుంది. అలాంటిపరిస్థితిలో వారికి పెల్విక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అలాగే పీరియడ్ కి పీరియడ్ కి మద్యలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది.పస్ లాంటిది రావడం, దుర్వాసన రావడం. శృంగారం చేసే సమయంలో అక్కడ పుండుకి టచ్ అయ్యి రక్తస్రావం అవ్వడం వంటి లక్షణాలు కనబడుతాయి.

వైట్ డిశ్చార్జ్ ను చాలా సాధారణ సమస్యగా చూస్తారు, దానికి కూడా డాక్టర్ ను సంప్రదించాలా?

వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్ . చాలా మంది వైట్ డిశ్చార్జ్ అవుతుందోని చాలా కంగారుపడిపోయి , క్యాన్సర్ లక్షణం అనుకుంటారు. కానీ మన మానవ శరీరంలో తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. పీరియడ్ అయిపోయిన తర్వాత వాటరీ డిశ్చార్జ్ పీరియడ్ ముందు కాస్త మందపాటి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. దీని మూలంగా వజైనా తడిగా ఉండటం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

ఒక డాక్టర్ గా ఎప్పుడు డాక్టర్ ను కలవమంటాను అంటే?

వైట్ డిశ్చార్జ్ దురద ఉన్నా, చెడు వాసన ఉన్నా, రక్తం కలిసినా. ఈ ఏ లక్షణాలు కనబడుకుంటే డాక్టర్ ను కలవాల్సిన అవసరం లేదు.

Cervical Cancer Symptoms

ఎలాంటి లక్షణాలు కనబడినప్పు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ను కలవాలి?

రతిలో పాల్గొనే ప్రతి స్త్రీ మూడేళ్ళకొకసారి పాప్‌స్మియర్‌ టెస్ట్ చేయించుకోవాలి. లక్షణాల కోసం ఎదురుచూడవద్దు.

పాప్‌స్మియర్‌ వ్యాలిడి?

పాప్‌స్మియర్‌ వ్యాలిడి 3 సంవత్సరాలు. నెక్ట్స్ మూడేళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ రాబోతుందా? అది లోరిస్కా ? హైరిస్కా అనేది చెబుతుంది. పాప్‌స్మియర్‌ నార్మల్ వస్తే ఒక మంచి హస్పిటల్లో తిరిగి వెళ్ళవచ్చు.

పాప్‌స్మియర్‌ గురించి క్లుప్తంగా

ఏ వయస్సులో వేయించుకోవాలి? అస్సలు శృంగారం లో పాల్గొనకుండా ఉంటే ఈ వ్యాప్సిన్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా 17 ఏళ్ళ లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించండి. 9 నుండి 15 లోపు రెండు డోసుల వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి. అలాగే 15 ఏళ్ళ దాటినా వారికి ఎలాంటి గ్రోత్ లేదంటే 26 ఏళ్ళ వరకు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

ప్రభుత్వ సమాచారం ప్రకారం 15లోపు 2 డోస్ లు ఇవ్వండి 15 నుండి 26 వరకు 3 డోస్ ఇవ్వండి. అని చెబుతుంది. అయితే భవిష్యత్త్ లో సింగిల్ డోస్ కూడా సరిపోతుంది అని చెప్పే అవకాశాలున్నాయి.. ఇది కూడా పూర్తి రక్షణ కల్పిస్తుంది.

సర్వికల్ క్యాన్సర్ ను ఎలా ట్రీట్మెంట్ చేయాలి?

దీన్ని పాప్‌స్మియర్‌ టెస్ట్ ద్వారా కనిపెట్టి, ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు.

సర్వైకల్ క్యాన్సర్ గురించి మీరు మహిళలకు ఇచ్చే సలహా ఏంటి?

చాలా సింపుల్ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించండి. మూడళ్లకు ఒకసారి పాప్‌స్మియర్‌ టెస్ట్ చేయించుకోండి. ఈ క్యాన్సర్ మిమ్మల్ని తాకదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion