Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Doctor’s Suggestion ఈ రైస్‌పై సంజీవని కూడా పనికిరాదట.. తింటే ఒక్క రోగం కూడా రాదు!
చాలా మంది భారతీయులు తమ భోజనంలో ప్రధాన ఆహారంగా బియ్యాన్ని ఎంచుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా మంది బియ్యంతోనే ఆహారాన్ని తింటుంటారు. అలాగే బియ్యంతో చేసిన రోటీలను కూడా ఆస్వాదిస్తుంటారు. ఆ బియ్యంలో తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం, బ్రౌన్ బియ్యం వంటి రకాలు కూడా ఉన్నాయి. భారతీయులు రకరకాల బియ్యాన్ని వినియోగిస్తున్నప్పటికీ.. అవి కాలుష్యమవడం, అలాగే ఎక్కువగా పాలిష్ చేయడం వలన మంచి ఫలితాలను పొందలేకపోతున్నారు.
అందుకే చాలా మంది ఈ మధ్యకాలంలో నల్ల బియ్యాన్ని ఎంచుకుంటున్నారు. అలాగే వైద్యులు కూడా దీనిని ఎక్కువగా సిఫారసు చేస్తున్నారు. పోషకవిలువలు పరంగా ఈ రైస్ ఒక అద్భుతమని పేర్కొంటున్నారు. ఇందులో వైద్యానికి మించిన ఆరోగ్య గుణాలు ఉన్నాయట. ఈ బియ్యం చాలా అరుదుగా దొరికినప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందించగలదని ప్రముఖ్య వైద్య నిపుణులు గిరిధర్ రెడ్డి చెప్పారు. ఆయన మాటల్లోనే ఈ బ్లాక్ రైస్ తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బ్లాక్ బియ్యం ఎక్కడ దొరుకుతుంది
ఈ నల్ల బియ్యం పూర్వకాలంలో చైనాలో కొందరు రాజుల కోసం మాత్రమే పండించబడేది. దాన్ని "ఫోర్బిడెన్ రైస్" అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం మన దేశంలో ఇది ప్రధానంగా మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సాగు అవుతోంది. జీవ వైవిధ్యంతో పాటు దీనికి ఉన్న ప్రాచీన వారసత్వం కూడా గుర్తించదగిన అంశం.
గిరిధర్ రెడ్డి మాటల్లో బ్లాక్ రైస్ ఉపయోగాలు
ఈ నల్ల బియ్యంలో పోషక విలువలు చాలా ఉంటాయని గిరిధర్ రెడ్డి చెప్పారు. ఇందులో ప్రోటీన్, ఐరన్, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఆంథోసైనిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. ఇందులోని ఆంథోసైనిన్లు ఈ బియ్యాన్ని నల్ల రంగు రావడానికి ప్రధాన కారకాలని పేర్కొన్నారు. ఈ బియ్యం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
"ఈ నల్ల బియ్యంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ యాక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే తరచుగా వచ్చే వైరల్ వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తాయి. తద్వారా మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంగా జీవించగలుగుతాయి. దీంతో పాటు ఈ నల్ల బియ్యం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో గుండెకు మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్లు గుండెకు మేలు చేసే రసాయనాలుగా పని చేస్తాయి. ఇవి హై కోలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను నిరోధించగలవు.
ముందుగానే చెప్పినట్లు నల్ల బియ్యంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగి.. మతిమరుపు వంటి దూరమవుతాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత, మానసిక అనేది కూడా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మందిని బాధ పెడుతున్న సమస్య షుగర్. అయితే ఈ బ్లాక్ రైస్ తినడం వలన షుగర్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యంలో ఉంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరం.
ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీనివల్ల మలబద్దకం నివారణ, పేగుల ఆరోగ్యం మెరుగవడం వంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కొన్నిసార్లు ఎలుకలపై జరిగిన అధ్యయనాల్లో, బ్లాక్ రైస్ లివర్ ఫ్యాట్ స్థాయిని తగ్గించగల సామర్థ్యం ఉందని తేలింది. ఇది ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్‌ను కూడా తగ్గించడంలో దోహదపడుతుంది" అని చెప్పారు.
సాధారణంగా మనం ఎక్కువగా తెల్ల బియ్యం వాడుతున్నప్పటికీ, నల్ల బియ్యాన్ని భోజనంలో చేర్చడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు. ఇది కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో ఒక బలమైన మిత్రుడిగా నిలవగలదని చెప్పారు. మీ ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు తీసుకురావాలనుకుంటే, నల్ల బియ్యం ఒక శ్రేష్టమైన ఎంపిక. రుచితోపాటు ఆరోగ్యాన్ని కోరేవారికి ఇది మిస్ అవ్వని ఒక అద్భుత ఔషధం అని చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications