Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సూపర్ ఫుడ్ వెనుక దాగి ఉన్న ప్రమాదాలు..చియా విత్తనాలతో ఈ సైడ్ ఎఫెక్ట్స్!
ఇటీవల కాలంలో హెల్త్ మీద కేర్ తీసుకునే ప్రతి ఒక్కరి కిచెన్ రూమ్ లో చియా విత్తనాలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. బరువు తగ్గాలనుకునే వారి నుండి ఫిట్‌నెస్ ప్రియుల దాకా అందరూ దీనిని ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి అద్భుతమైన పోషకాల గని ఈ చిన్ని గింజలు.
చియా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తీసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ సూపర్ ఫుడ్ కూడా అందరికీ మేలు చేయదు. కొందరి పాలిట ఈ చియా విత్తనాలే అనారోగ్యానికి కారణం కావచ్చని ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ జుష్య భాటియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.

చియా విత్తనాలను ఎవరు తీసుకోకూడదు
జీర్ణ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త
రెగ్యులర్ గా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు చియా విత్తనాలకు దూరంగా ఉండటమే బెటర్. చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. చియా గింజలు నీటిని పీల్చుకుని తమ బరువు కన్నా 10 రెట్లు ఉబ్బుతాయి.
వాటిని సరిగ్గా నానబెట్టకుండా తింటే కడుపులో తిమ్మిర్లు, నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఒకవేళ మీరు వీటిని ప్రయత్నించాలనుకుంటే కేవలం అర టీస్పూన్‌తో ప్రారంభించి, మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా మోతాదును పెంచుకోవాలి.
లో బీపీ, రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు
చియా విత్తనాలలో ఉండే ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి వరం. కానీ ఇప్పటికే లో బీపీ సమస్యతో బాధపడేవారికి ఇది ప్రమాదకరం.
చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి రక్తపోటు మరింత పడిపోయి తీవ్రమైన తలతిరగడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే వార్ఫరిన్, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్న వారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి.
వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా రక్తాన్ని పలుచబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. దీంతో చిన్న గాయమైనా అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
అలెర్జీలు ఉన్నవారు
గతంలో మీకు నువ్వులు, అవిసె గింజలు లేదా ఆవాలు వంటివి పడనట్లయితే మీరు చియా విత్తనాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటి మధ్య క్రాస్ రియాక్టివిటీ ఉండే అవకాశం ఉంది.
అంటే ఒక రకమైన గింజలకు అలెర్జీ ఉంటే మరో రకమైన గింజలు కూడా పడకపోవచ్చు. దురద, దద్దుర్లు, చర్మంపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చియా విత్తనాలను ఆపేసి డాక్టర్ ని సంప్రదించాలి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు చియా విత్తనాలను చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిలో పొటాషియం, భాస్వరం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఈ ఖనిజాలను సులభంగా ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి.
కానీ కిడ్నీల పనితీరు సరిగ్గా లేనప్పుడు, ఈ ఖనిజాలు రక్తంలో పేరుకుపోయి గుండె సమస్యలతో పాటు ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications