Latest Updates
-
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
సాధారణ వ్యాధి కాదు,సైలెంట్ కిల్లర్: ఏం కాదులే అని లైట్ తీసుకున్నారంటే ఇక అంతే!
కొన్ని వ్యాధులు ఏం చేస్తాయిలే అని మనం తేలికగా తీసుకుంటుంటాం. అయితే వాటివల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటదని తెలుసుకునే సమయానికి పరిస్థితి చేజారిపోతుంటది. కాబట్టి ఏ చిన్న వ్యాధి అయినా తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా ఫ్యాటీ లివర్ వ్యాధిని చాలా మంది పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అయితే ఈ వ్యాధి మరణించే ప్రమాదాన్ని 50శాతం పెంచుతుందట. సాధారణ వ్యాధిలా కనబడుతూ మరణ ప్రమాదాన్ని భారీగా పెంచేసే ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ చూడండి.
ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే ఏంటీ
ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది కాలేయంలో అధికమొత్తంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి. సాధారణంగా కాలేయంలో కొంతశాతం కొవ్వు ఉంటది..అయితే అది మొత్తం బరువులో 5 శాతం నుంచి 10 శాతం కంటే ఎక్కువ ఉంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగినట్లయితే అది కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని కూడా పిలుస్తారు. ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రధానంగా రెండు రకాలు ఉంటుంది. అందులో ఒకటి నాల్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీస్..రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD).. మద్యం సేవించని లేదా చాలా తక్కువగా సేవించే వ్యక్తులలో కనిపిస్తుంది.ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణంగా కనిపించే కాలేయ వ్యాధి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD)..ఎక్కువగా మద్యం ఎక్కువగా సేవించే వ్యక్తులలో కనిపిస్తుంది. మద్యం నేరుగా కాలేయ కణాలను దెబ్బతీస్తుంది, దీనివల్ల కొవ్వు పేరుకుపోతుంది.

ఫ్యాటీ లివర్ మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది
ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే తీవ్రమైనది. కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడేవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా మరణాల రేటును ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఊబకాయం, జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉన్న ఈ వ్యాధి కాలేయానికి హాని కలిగించడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర ప్రధాన అనారోగ్యాల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధి గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది
కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి,వాపుని నివారించడానికి కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు అది దీర్ఘకాలిక వాపు, ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. ఈ రెండూ గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలు. ఇటీవలి ఓ పరిశోధన ప్రకారం..ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడేవాళ్లలో గుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం సాధారణ జనాభా కంటే 54శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు అనుభవించకపోయినా కూడా వారి గుండే తీవ్రమైన ప్రమాదంలో ఉండవచ్చు.
ఫ్యాటీ లివర్ కారణంగా గుండె జబ్బులు ఒక ప్రధాన సమస్య అయినప్పటికీ..ఇది అనేక ఇతర ప్రాణాంతక పరిస్థితులతో ముడిపడి ఉంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి లివర్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 35 రెట్లు ఎక్కువ, లివర్ వ్యాధి వల్ల మరణాల రేటు 27 రెట్లు ఎక్కువ. ఫ్యాటీ లివర్ శరీరంలోని ఇతర భాగాలలో అంటే పెద్దప్రేగు, ప్యాంక్రియాస్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని 47శాతం పెంచుతుంది. ఫ్యాటీ లివర్..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్ మూత్రపిండాల పనితీరు క్షీణింపజేసి..దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి వ్యక్తులను తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులకు గురి చేస్తుంది.
మీకు ఫ్యాటీ లివర్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి
మీకు ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే ఫ్యాటీ లివర్ సాధారణంగా ప్రారంభదశలో గుర్తించబడదు. ఇది సాధారణంగా గుర్తించదగిన లక్షణాలను కలిగించదు కాబట్టి మీరు ప్రమాదంలో ఉన్నారో లేదో తనిఖీ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
బ్లడ్ టెస్ట్
పెరిగిన లివర్ ఎంజైమ్‌లు (ALT, AST) కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి సంకేతం కావచ్చు.
అల్ట్రాసౌండ్ లేదా ఫైబ్రోస్కాన్
ఇమేజింగ్ టెస్ట్ లు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.
కాలేయ బయాప్సీ (Liver Biopsy)
కొన్ని సందర్భాల్లో కాలేయ కణజాలం నమూనాను తీసి పరీక్షించడం (బయాప్సీ) అవసరం కావచ్చు. ఇది కాలేయ నష్టం తీవ్రతను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.ః
ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు చికిత్స ఏమిటి?
ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది తీవ్రమైన సమస్యగా మారగలదు. కాబట్టి దానిని ముందుగా గుర్తించడం మరియు సరైన జీవనశైలి మార్పులతో నిర్వహించడం చాలా ముఖ్యం. ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు నిర్దిష్ట మందులు లేవు. ట్రీట్మెంట్ ప్రధానంగా జీవనశైలిలో మార్పులపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడం,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం,క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,మద్యపానం మానేయడం, మధుమేహం,కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చేయాలి. ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి ఏమైనా ఆందోళనలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications