Latest Updates
-
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
కోడిగుడ్డు ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. డాక్టర్లు, పోషకాహార నిపుణులు సైతం రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. పోషకాహార లోపం కూడా పోతుంది. అందుకే మధ్యాహ్నా భోజన పథకం కింద పిల్లలకు కూడా స్కూల్స్ లో గుడ్డు పెడుతుంటారు. అంగన్ వాడీ స్కూల్స్ లో కూడా రోజూ పిల్లలకు గుడ్డు ఇస్తుంటారు.
అయితే బోలెడు ప్రయోజనాలను అందించే గుడ్డును పిల్లలకు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో అవి ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంటాయి. కాబట్టి అసలు పిల్లలకు గుడ్డు పెట్టెటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటీ, దానికి పరిష్కార మార్గాలు ఏంటనేవి ఖమ్మంకి చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.

గుడ్డు పెట్టడం ఆలస్యం చేయడం
పిల్లలకు 6 నెలలు నిండాక గుడ్డులోని పసుపు సొన మొదలుపెట్టవచ్చు. 8 నెలలు నిండాక తెల్లసొన ఇవ్వవచ్చు.
పసుపు సొన చెడు కొలెస్ట్రాల్ అనుకోవడం
కోడిగుడ్డులోని పసుపు సొనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటదని, ఇది పిల్లలకు మంచిది కాదని భావించి చాలామంది ఆ సొనను పడేసి కేవలం తెల్లసొన మాత్రమే తినిపిస్తుంటారు. అయితే ఇది అతిపెద్ద పొరపాటు. పసుపు సొనలో బ్రెయిన్ ఎదుగుదలకి సహాయపడే కోలిన్(choline)ఉంటుంది. ఇందులో ఎముకల బలానికి అవసరమైన విటమిన్ d3, b12 పుష్కలంగా లభిస్తాయి.

ప్రతిరోజూ ఒకే రకంగా ఇవ్వడం
రోజూ ఒకేరకమైన ఫుడ్ తింటే పెద్దలకైనా విసుగొస్తుంది కదా..అలాగే పిల్లలకు రోజూ అవే ఉడకబెట్టిన గుడ్లు పెడితే విసుగురావడం సహజం. దీంతో అవి తినడానికి పిల్లు మారం చేస్తుంటారు. కాబట్టి వారిని ఆకట్టుకునేలా గుడ్డును పిల్లలకు వేర్వేరు రూపాల్లో ఇవ్వండి. ఆమ్లెట్, బుర్జీ లాగా ట్రై చేసి పిల్లలకు తినిపించండి.
నాటు కోడిగుడ్లే మంచివి అనుకోవడం
ఫారం కోడిగుడ్లు తింటే పెద్దగా బలం రాదు అని భావించి చాలామంది నాటు కోడిగుడ్లనే పిల్లలకు తినిపిస్తుంటారు. అయితే వాస్తవానికి నాటు కోడిగుడ్డు, ఫారం కోడిగుడ్డు రెండిట్లోనూ సమానమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి నాటుకోడిగుడ్లు మాత్రమే అనే భావన వదిలేయండి.
అలెర్జీ లక్షణాలను గుర్తించకపోవడం
గుడ్డు తిన్నాక దద్దుర్లు, ర్యాషస్, విరోచనాలు, వాంతులు అనిపిస్తే మాత్రం అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే అది ఎగ్ అలెర్జీకి సంకేతం. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
