Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలకు కల్లు తాగించడం మంచిదేనా? డాక్టర్ ఏం చెబుతున్నారు?
మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పిల్లలకు ఆప్యాయంగా నాలుగైదు గుక్కలు కల్లు తాపిస్తుంటారు పెద్దలు. పిల్లలకు కల్లు తాపించడం మంచిదే అనుకుంటూ ఈ పని చేస్తుంటారు. కల్లు తాపితే పిల్లలు బొద్దుగా అవుతారు,ఆరోగ్యానికి మంచిది, బాగా నిద్ర పోతారు అని నమ్ముతుంటారు.
అయితే పిల్లలకు కల్లు తాపించడం మంచిదా? కాదా? అనే విషయంపై వరంగల్ కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ పసునూతి సుమంత్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

అయితే ప్రేమతో చేసే ఈ పని పిల్లల ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ సుమంత్ అంటున్నారు. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్కహాల్ తాగాలి అంటే 21 ఏళ్ల వయస్సు ఉండాలి. కానీ కల్లు ఆల్కహాల్ ఎట్లా అవుతుంది అది నేచురల్ కదా,చెట్టు నుంచి వస్తుంది కదా అని చాలామంది వాదిస్తుంటారు.
అయితే డాక్టర్ పసునూతి సుమంత్ దీనికి శాస్త్రీయమైన వివరణ ఇస్తూ ఏంటున్నారంటే..చెట్టు నుంచి కల్లు చుక్క రావడం ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే ఫర్మెంటేషన్(పులియబెట్టే ప్రక్రియ) స్టార్ట్ అవుతుంది. కేవలం 1-2 గంటల్లోనే 0.5-2 శాతం ఆల్కహాల్ వస్తుంది. సాయంత్రం వరకు వదిలేస్తే ఆ శాతం 4-5 వరకు చేరుకుంటుందన్నారు.
అంటే సాయంత్రం మనం తాగే కల్లు దాదాపుగా బీర్ తో సమానంగా మత్తు కలిగిస్తుందన్నమాట. కాబట్టి ఆ 1-2 శాతం ఆల్కహాల్ వల్ల పెద్దలకు ఏం కాకపోవచ్చు కానీ పిల్లలకు చాలా ప్రమాదకరం అని డాక్టర్ సుమంత్ తెలిపారు.
పిల్లల లివర్ ఏం చేస్తుందంటే..
పెద్దల లివర్ కు, చిన్న పిల్లల లివర్ కు చాలా తేడా ఉంటది. పెద్దవాళ్లు 1-2 శాతం ఆల్కహాల్ తీసుకున్నా వారి లివర్ దానిని తట్టుకోగలదు. కానీ పిల్లల లివర్ లో ఆల్కహాల్‌ను అరిగించుకునే ఎంజైమ్స్ అస్సలు ఉండవు.
ఎప్పుడైతే పిల్లలకు కల్లు తాపిస్తారో, వారి లివర్ ఆల్కహాల్ ను ప్రాసెస్ చేయలేక ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో శరీరానికి అత్యంత అవసరమైన గ్లూకోజ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది. పిల్లలకు ఫిడ్స్ రావడానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్ సుమంత్ అన్నారు.
రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. కల్లు తాగిన పిల్లల్లో గ్లూకోజ్ తయారీ ఆగిపోవడం వల్ల, మెదడుకు శక్తి అందక హైపోగ్లైసమిక్ సీజర్స్ వస్తాయి. అంటే ఫిడ్స్ వస్తాయన్నమాట. మూడు నెలల బేబీకి కూడా కల్లు తాగించి,తర్వాత ఫిడ్స్ రావడంతో తన దగ్గరకు తీసుకొచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని డాక్టర్ సుమంత్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications