Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
అతిగా తినేశాక కడుపు బెలూన్ లా ఉబ్బిందా? వెంటనే ఇలా చేయండి
కొన్ని సందర్భాల్లో ఫుడ్ రుచిగా ఉందని కొంచెం ఎక్కువ లాగించేసే అలవాటు చాలామందికి ఉంటుంది. రుచిగా ఉందని ఎక్కువగా తినడం మనందరికీ అలవాటే కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. కడుపులో గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, కడుపు బెలూన్ లా ఉబ్బిపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది వెంటనే మెడికల్ షాపుకి వెళ్ల ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు. తరచూ మందులు వాడటం వల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు తప్పవు. మందుల షాపుకు పరిగెత్తే బదులు, మీ వంటగదిలోని ఈ సహజ సిద్ధమైన చిట్కాలతో తక్షణమే ఉపశమనం పొందవచ్చు. ఇవి కడుపులో చిక్కుకున్న గ్యాస్‌ను బయటకు పంపి, ఉబ్బరాన్ని వెంటనే తగ్గిస్తాయి.
జీలకర్ర నీటితో తక్షణ ఉపశమనం
ఎక్కువగా తినేశామని అనిపించిన వెంటనే ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగేయండి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. జీలకర్ర జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం తేలికగా అరిగేలా చేస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. వేయించిన జీలకర్ర పొడిని నల్ల ఉప్పుతో కలిపి నీటిలో తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

వాము-అల్లం టీ
కడుపు ఉబ్బరంతో అసౌకర్యంగా ఉంటే వాము అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో అర చెంచా వాము, ఒక అంగుళం తురిమిన అల్లం వేసి మరిగించండి. వడకట్టి అలాగే లేదా కొద్దిగా తేనె కలుపుకుని తాగండి. వాము గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇది గ్యాస్, అజీర్తిని తగ్గించి తేన్పుల సమస్యను నివారిస్తుంది.
సోంపు
మనం ఏదైనా హోటల్ కో లేదా రెస్టారెంట్ కో వెళ్లినప్పుడు అక్కడ ఫుడ్ తిన్నాక బిల్ ఇచ్చే టైంలో సోంపు కూడా తీసుకొచ్చి మన ముందు పెడతారు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. సోంపులోని గుణాలు పేగుల్లో చిక్కుకున్న గ్యాస్ ను బయటకు పంపి, కడుపు కండరాలకు విశ్రాంతినిస్తాయి. భోజనం తర్వాత ఒక చెంచా సోంపును బాగా నమలండి లేదా ఒక కప్పు వేడి నీటిలో సోంపు వేసి మరిగించి ఆ నీటిని తాగండి
పుదీనా
పుదీనా ఆకులు కడుపులో మంటను తగ్గించి, సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. పుదీనాలోని మెంథాల్ కడుపు కండరాలను రిలాక్స్ చేసి, గ్యాస్ సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. నాలుగైదు తాజా పుదీనా ఆకులను నమలడం లేదా పుదీనా టీ తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ధనియాల కషాయం
ధనియాలు కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి ఒక శక్తివంతమైన సహజ నివారణ. ఒక చెంచా ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల గ్యాస్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications