Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దొరికిందే ఛాన్స్ అని ఫుల్లుగా తింటున్నారా? అతిగా తిన్న తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
కొంతమంది ఏదో బతకడానికి అన్నట్లుగా మితంగా తింటుంటారు..మరికొందరు అయితే అదేదో ఉద్యమంలా తింటుంటారు. ఫుడ్ లవర్స్ అని చెప్పుకుంటూ అపరిమితంగా ఏది పడితే అది పొట్టలో ఖాళీ లేకుండా తింటుంటారు. కొన్నిసార్లు భారీగా తిన్న తర్వాత కడుపు బరువుగా,అసౌకర్యంగా అనిపించడం సర్వసాధారణం. ముఖ్యంగా నూనెలో వేయించిన లేదా అధిక మసాలాలు ఉన్న ఆహారాలు తిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
హై ఫ్యాట్ ఫుడ్ తీసుకునే వారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో భారీ ఆహారం తిన్న తర్వాత మీకు అసౌకర్యం కలగకుండా, తేలికగా అనిపించేలా ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి ఇప్పుడు చూద్దాం.

నిమ్మకాయ నీరు
భారీ భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి నిమ్మకాయ నీరు ఒక ప్రభావవంతమైన నివారణ. నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ C జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది కడుపులో భారం, అసౌకర్య భావనను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పుదీనా
భారీ భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి పుదీనా మంచి మార్గం. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి..ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపులో భారంగా అనిపించడం, అసౌకర్యం సమస్యను కూడా తగ్గిస్తుంది.
నీరు తాగాలి
నీరు మన శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా భారీ భోజనం తర్వాత భారీ భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి నీరు త్రాగడం ఒక ప్రభావవంతమైన మార్గం. తిన్న వెంటనే కాకుండా కొన్ని నిమిషాల తర్వాత నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగుతుంది. కడుపులో బరువుగా అనిపించడం,అసౌకర్యం అనే సమస్యను ఇది తగ్గిస్తుంది.
వ్యాయామం
భారీగా కడుపు నిండా తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి వ్యాయామం మంచి మార్గం. బరువుగా లేదా భారంగా అనిపించినప్పుడు కాసేపు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది, బరువుగా అనిపించడం, అసౌకర్యం అనే సమస్యను ఇది తగ్గిస్తుంది.
నెమ్మదిగా తినండి
మీ కడుపు నిండిందని మీ మెదడుకు తెలియజేయడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. మీరు మొదటి 10 నిమిషాల్లో ఎక్కువ ఆహారం తింటే..మీ మెదడు దానిని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. మీరు ఎక్కువగా తినడం వల్ల అసౌకర్యంగా అనిపించడం ఖాయం. నెమ్మదిగా తినడం వల్ల మీరు తక్కువ కేలరీలు తినడమే కాకుండా కడుపు నిండిన అనుభూతిని కూడా పొందుతారు. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా మీరు భారీ భోజనం తర్వాత కూడా తేలికగా, హాయిగా ఉండగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications