Latest Updates
-
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్!
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి
అందమైన, ఒత్తైన కురులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. రాలిపోతున్న జుట్టును చూసి బాధపడే బదులు, మన వంటగదిలోనే దొరికే బెస్ట్ మెడిసిన్ మెంతులను మీ జుట్టు సంరక్షణ దినచర్యలో భాగం చేసుకోండి.
మెంతులలో ప్రోటీన్లు, ఐరన్ తో పాటు కురుల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రముఖ ఫేషియల్ కాస్మెటిక్, మాక్సిలోఫేషియల్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ ప్రగతి నవల్ సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.

మెంతుల హెయిర్ స్ప్రే
మీ కురులు రోజంతా తాజాగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ స్ప్రే వాడటం బెటర్. దీనిని ఎలా తయారుచేసేకోవాలంటే..రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకుని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి, ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోండి. దీన్ని రోజూ కురులకు స్ప్రే చేసుకోండి. మెంతులలో ఉండే ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను లోపలి నుంచి బలపరుస్తాయి. అంతేకాదు, చుండ్రు లేదా తల దురద వంటి సమస్యల నుంచి ఇది తక్షణ ఉపశమనం ఇస్తుందని డాక్టర్ ప్రగతి చెబుతున్నారు.

మెంతుల హెయిర్ ఆయిల్
సహజంగానే జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే ఈ నూనెను మించిన మందు లేదు. ఒక గిన్నెలో అర కప్పు కొబ్బరి నూనెను తీసుకుని సన్నని మంటపై కాస్త వేడి చేయండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, నూనెను వడకట్టి గింజలను తీసేయండి. పోషకాలు నిండిన ఈ నూనెను తలకు, కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేయండి. కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే, జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
మెంతుల మ్యాజిక్ హెయిర్ ప్యాక్
మీ జుట్టు పట్టుకుచ్చులా నిగనిగలాడుతూ, మృదువుగా మారాలంటే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే. ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి తీసుకుని, దానికి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి. ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లా కలుపుకుని, ఈ మాస్క్ ను తలకంతటికీ పట్టించి ఓ 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గాఢత తక్కువగా ఉండే (మైల్డ్) షాంపూతో తలస్నానం చేయండి. పెరుగు, మెంతుల కలయిక జుట్టుకు చక్కటి కండిషనింగ్ అందించి, తేమను లాక్ చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
