Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
డెడ్ లైన్ లు, టార్గెట్ లు అంటూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా బర్నౌట్ సిండ్రోమ్ గురించి తెలుసుకోవాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా ఇదొక పెను సవాలుగా మారింది. సర్వేల ప్రకారం దేశంలోని 60 శాతం మంది వృత్తి నిపుణులు, ఉద్యోగులు ఈ సమస్యతో తీవ్రంగా పోరాడుతున్నారు.

శరీరంపై బర్నౌట్ సిండ్రోమ్ ప్రభావం
ఈ బర్నౌట్ సిండ్రోమ్ ఇలాగే కొనసాగితే, మన శరీరంలో ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్, నిద్రను క్రమబద్ధీకరించే మెలటోనిన్ హార్మోన్ల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి, నిద్రలేమి, తీవ్రమైన అలసట వేధిస్తాయి.
రోగనిరోధక శక్తి క్షీణించడంతో పాటు గుండె, జీర్ణవ్యవస్థల పనితీరు మందగిస్తుంది. ఇది క్రమంగా ప్రాణాంతకమైన అధిక రక్తపోటుకు దారితీస్తుంది. నిరంతర చిరాకు, కోపం, కండరాల నొప్పులు, తీపి పదార్థాలు తినాలనే కోరిక పెరగడం.. ఇవన్నీ రక్తపోటును మరింత తీవ్రతరం చేస్తాయి.
3S ఫార్ములా
ఈ బర్నౌట్ సిండ్రోమ్ బారినుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రసిద్ధ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఒక అద్భుతమైన 3S ఫార్ములాను సూచించింది. అవేమిటంటే.. సిట్ (కూర్చోవడం), స్టాండ్ (నిలబడటం), స్ట్రెచ్ (సాగదీయడం).
ఆఫీసులో మీ పని గంటలను 30 నిమిషాల చొప్పున విభజించుకోండి. ప్రతి అరగంటలో 20 నిమిషాలు కూర్చుని పనిచేయండి, 8 నిమిషాలు నిలబడండి, ఆపై 2 నిమిషాల పాటు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. ఈ చిన్న మార్పు మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో అద్భుతాలు సృష్టిస్తుంది.
అధిక రక్తపోటు - ప్రాణాంతకమైన ముప్పు
ఒత్తిడి వల్ల వచ్చే అధిక రక్తపోటును సకాలంలో అదుపు చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. బీపీ పెరిగినప్పుడు మెదడులోని నరాల్లో ఒత్తిడి పెరిగి అవి చిట్లిపోతాయి. దీనివల్ల బ్రెయిన్ హ్యామరేజ్ (మెదడులో రక్తస్రావం) జరుగుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీల వైఫల్యం, మతిమరుపు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
తరచుగా తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నరాలు జలదరించడం, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి బీపీ పెరిగిందనడానికి ముఖ్య సంకేతాలు.
నివారణ,ఆరోగ్య సూత్రాలు
-రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. మీకు ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నట్లయితే.. వ్యాయామం చేసేటప్పుడు శీర్షాసనం, సర్వాంగాసనం, గుంజీలు వంటి కఠినమైన ఆసనాలకు దూరంగా ఉండాలి.
-బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆల్కహాల్ కి పూర్తిగా దూరంగా ఉండాలి.
-శరీరానికి పుష్కలంగా నీరు అందించాలి. జంక్ ఫుడ్ మానేసి, సమయానికి పోషకాలతో కూడిన భోజనం చేయాలి. ఉపవాసాలు చేయకూడదు. కనీసం 6 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అత్యంత అవసరం.
ఏం తినాలి?
మీ రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండాలంటే రోజువారీ డైట్ లో ఖర్జూరం, దాల్చిన చెక్క, ఎండుద్రాక్ష, క్యారెట్, అల్లం, టమోటాలను తప్పనిసరిగా చేర్చుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











