Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
జాన్ అబ్రహం బాడీ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఆ రెండు కూరగాయలను ఎందుకు తినడంటే?
బాలీవుడ్ లో హ్యాండ్సమ్ హంక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జాన్ అబ్రహం. 53ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కేవలం మహిళా అభిమానులే కాదు, పురుషులు సైతం జాన్ బాడీని చూసి స్ఫూర్తి పొందుతుంటారు.
అయితే ఆ సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరం వెనుక కఠినమైన క్రమశిక్షణ, ఎన్నో త్యాగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. జాన్ అబ్రహం తన ఆహార అలవాట్ల విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారో ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఓ పాడ్ కాస్ట్ లో చెప్పారు.

జాన్ అబ్రహం తనపై తాను విధించుకునే క్రమశిక్షణ చూసి ఒక్కోసారి తనకే ఆశ్చర్యం వేస్తుందని.. ఈ రోజు కేవలం నాలుగు రకాల కూరగాయలు మాత్రమే తినాలని చెబితే మారు మాట్లాడకుండా ఆయన అలాగే చేస్తారు అని వినోద్ తెలిపారు. ఈ క్రమశిక్షణలో భాగంగానే జాన్ అబ్రహం తనకు ఎంతో ఇష్టమైన రెండు కూరగాయలను తినడం పూర్తిగా మానేశాడని వినోద్ చన్నా ఆ పాడ్ కాస్ట్ లో చెప్పారు. అవే వంకాయ,బెండకాయ.
జాన్ ఎందుకు వీటిని దూరం పెట్టారు?
జాన్ అబ్రహం ఒకప్పుడు వంకాయ, బెండకాయలను ఇష్టంగా తినేవారు. కానీ వీటిని తిన్నప్పుడల్లా ఆయనకు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తేవట. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా ఈ రెండు కూరగాయలను ముట్టుకోవడం కూడా మానేశారు.
ఇప్పుడు ఆయనకు ఆ కూరగాయలు పెట్టినా ఆయన శరీరం వాటిని జీర్ణించుకోలేదు. ఎందుకంటే వాటిని ఎలా జీర్ణం చేసుకోవాలో ఆయన శరీరం మర్చిపోయింది అని వినోద్ వివరించారు.
నిజంగానే ఈ కూరగాయలు సమస్యలు తెస్తాయా?
పోషకాహార నిపుణుల ప్రకారం అందరికీ కాకపోయినా.. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి వంకాయ, బెండకాయలు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి.
వంకాయలో సోలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చాలామందిలో అజీర్తిని, మంటను కలిగిస్తుంది. పైగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా వంకాయను నూనెలో వేయించినప్పుడు, అది అధిక నూనెను పీల్చుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.
బెండకాయలో ఫ్రక్టాన్స్ అనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇవి సరిగ్గా జీర్ణం కావు. అలాగే బెండకాయలో ఉండే జిగురు మలబద్ధకానికి మంచిదే అయినా, మోతాదు మించితే కడుపులో వాయువు ఏర్పడుతుంది.
మరి సమస్య రాకుండా ఏం చేయాలి?
అందరూ జాన్ అబ్రహంలా వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
వంకాయ, బెండకాయలను డీప్ ఫ్రై చేయకుండా, బాగా ఉడికించి లేదా పులుసుగా చేసుకుని తినడం మంచిది. వంటలో అల్లం, జీలకర్ర లేదా ఇంగువను వాడటం వల్ల గ్యాస్ తగ్గుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని రాత్రి పూట కాకుండా, మధ్యాహ్న భోజనంలో తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications