Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
Myths And Facts: ఆరోగ్యం గురించి నిజాలని నమ్మే ఇవన్నీ అపోహలే, నిజాలేంటో తెలుసా?
ఆరోగ్యం విషయం వచ్చే సరికి చాలా మంది చాలా రకాల సలహాలు ఇస్తుంటారు. కడుపు మంటగా ఉందని, ఉబ్బరంగా ఉందని, జలుబు చేసిందని చెబితే చాలు రకరకాల హోం రెమిడీస్ టకటకా చెప్పేస్తుంటారు. అందులో చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి కూడా.
అలాగే ఆరోగ్యం విషయంలో చాలా మంది అవగాహన ఉన్నప్పటికీ.. కొన్ని అపోహలను కూడా నిజమని నమ్మేస్తుంటాం చాలా మంది. దెబ్బలి తగిలితే అవి తినొద్దు ఇవి తినొద్దు, ఆ ఫుడ్స్ తింటే ఈ రోగం వస్తుంది అంటూ చాలానే చెబుతుంటారు. అయితే చాలా మంది నిజమని నమ్మే కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.వెజిటేరియన్స్‌కు తగినంత ప్రోటీన్ అందదు!
ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. శాకాహారులు కూరగాయలు, ఎండు బఠానీలు, బీన్స్, చిక్‌పీస్, కిడ్నీ బీన్స్, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, సోయా ఉత్పత్తులు సహా అనేక రకాల ఆహారాలు తినడం ద్వారా తగినంత ప్రోటీన్ తీసుకుంటారు. మాంసంలో మాత్రమే ప్రోటీన్ ఉంటుంది, కూరగాయల్లో, తృణధాన్యాల్లో ఉండదు అనుకోవడం తప్పు. అలాగే శాకాహారులు కాల్షియం, ఐరన్, విటమిన్ బి12, డి వంటి ఇతర పోషకాల కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.
2. చాక్లెట్లు, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే మొటిమలు వస్తాయి!
చర్మం కింద ఉండే ఆయిల్ గ్రంథులు సెబమ్ అనే పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు మొటిమలు ఏర్పడతాయి. ఇది సాధారణంగా చర్మాన్ని లూబ్రికేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే అధికంగా ఉత్పత్తయ్యే సెబమ్, మృత చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేసినప్పుడు, ఆ ప్రాంతంలో చికాకు, వాపు, ఎర్రగా మారుతుంది. సెబాకౌస్ గ్రంథులు హార్మోన్ల కారణంగా అధిక సెబమ్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇతరుల కంటే టీనేజర్లలో మొటిమలు ఎక్కువగా కనిపించడానికి అదే కారణం. అలాగే కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, జెనెటిక్స్ కూడా కారణం కావొచ్చు. అంతే కానీ చాక్లెట్లు, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.
3. చేతి వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది!
చేతి వేళ్లు విరవడం అదే మెటికలు వేయడం వల్ల ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు ) వస్తాయని కొందరు నమ్ముతుంటారు. చేతి వేలి జాయింట్లలో సైనోవియన్ అనే ద్రవం ఉంటుంది. దీంట్లో ఒకరకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతి వేళ్లను విరిచినప్పుడు గ్యాస్ ఒక్కసారిగా తొలగిపోవడం వల్ల టిక్ అనే శబ్దం వస్తుంది. తరచూ ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల మృదులాస్థి దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్ ) వస్తుందన్న ఆధారాలేవీ లేవు.
4. ఆస్తమా ఉన్న వాళ్లు వ్యాయామం చేయవద్దు!
ఆస్తమా ఉన్న వాళ్లు వ్యాయామం చేయకూడదని చాలా మంది అంటారు. అయితే ఏరోబిక్ లాంటి వ్యాయామాలు చేయడం వల్ల శ్వాస రేటు పెరుగుతుంది. క్రమంగా ఈ స్థాయిని పెంచుతూ పోతే ఊపిరితిత్తుల శక్తిని మెరుగుపరుస్తుంది. రన్నింగ్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదే కానీ పూర్తిగా వ్యాయామం చేయకపోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ వంటి EIA(ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా)ని ప్రేరేపించే అవకాశం తక్కువగా ఉన్న అనేక క్రీడలు ఉన్నాయి.
5. స్పైసీ ఫుడ్స్ వల్ల అల్సర్ వస్తుంది!
స్పైసీ ఫుడ్స్ వల్ల అల్సర్ వస్తుంది అనడం కొంత వరకు తప్పే. పెప్టిక్ అల్సర్ కేసుల్లో దాదాపు మూడింట రెండు వంతులు హెలికోబాక్టర్ పైలోరీ వల్ల వస్తాయి. యాస్పిరిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవడం, లేదా పొగాకు తాగడం, ఆల్కహాల్ సేవించడం వంటివి అల్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే మసాలా అహారాలు, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అప్పటికే ఉన్న అల్సర్ ఎక్కువ అవుతుంది తప్పా కొత్తగా అల్సర్ రాదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications