Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Heart attack in winter: చలికాలంలో పొద్దున్నే ఇలా చేయకపోతే..గుండెపోటు వచ్చే ఛాన్స్!
సాధారణంగా చలికాలంలో అంటువ్యాధుల ముప్పు పెరగడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె సిరల్లో సంకోచం ఉంటుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది..ఫలితంగా ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఏడాది దేశం అంతటా రికార్డు స్థాయిలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచానా వేశారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు వహించాలి.
వేసవికాలంతో పోలిస్తే శీతాకాలంలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 30 శాతం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు కూడా తెలిపాయి. అయితే చలికాలంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని తప్పులు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి చలికాలంలో ఉదయం నిద్రలేచిన తర్వాత ఏం చేస్తే గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం.

చలికాలంలో ఉదయం లేవగానే ఇలా చేయండి
-ఉదయాన్నే నిద్రలేచి దుప్పటి తీసేసి బెడ్ పైనుంచి వెళ్లిపోకూడదు. ఉదయాన్నే లేచి కూర్చోవడానికి 20-30 సెకన్ల ముందు మీ పాదాలను మంచం నుండి ఒక నిమిషం పాటు ఉంచండి. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.
-మందు,సిగరెట్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. కొద్ది సేపు అయినా సరే రెగ్యులర్ వ్యాయామం చేయండి. ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు చేస్తే చాలు. ఇలా చేయడం మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
-రోజులో నీళ్లు ఎక్కువగా తాగండి. ఉప్పు,చక్కెర తీసుకోవడం తగ్గించండి.
-ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రిస్క్ తగ్గుతుంది. ఆహారంలో సీజన్ ప్రకారం పండ్లు,ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి.
-ఇప్పటికే ఏదైనా గుండె జబ్బు ఉంటే మీ మెడిసిన్ ని టైం ప్రకారం తీసుకోండి.
-తరచుగా ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండెపోటు లక్షణాలు ఏమైనా ఉంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా వెంటనే హాస్పిటల్ క వెళ్లి చెక్ చేయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications