Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. లక్షలకు లక్షలు..!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవన విధానం అనేది మారిపోతుంది. ఆధునిక యుగానికి అలవాటు పడడంతో పాటు.. ఆధునిక ఆహారపు అలవాట్ల బారిన పడడం వల్ల చాలా మంది లైంగిక సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, సంతాలేమి వంటి సమస్యల కారణంగా సతమతమవుతుంటారు. అలాంటి వారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వలన మంచి ఫలితాలను పొందొచ్చు.
ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆరోగ్యకరమైన జీవన శైలి, ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు మెరుగైన ఆహరం తీసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సహాయపడే కొన్ని చిట్కాలు:
ఆరోగ్యకరమైన ఆహారం:
వీర్య కణాల ఉత్పత్తి, వాటి ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీర్య కణాల ఉత్తత్తి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, సెలీనియం వంటి పోషకాలు కలిగిన ఆహరం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు లభిస్తాయి.
దీనివల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా సంతానలేమి సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. వాటితో పాటు వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటివి తీసుకోవాలి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి మంచివి. అలాగే స్పెర్మ్ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడతాయి. వీటితో పాటు ప్రోటీన్లు కలిగిన ఆహారాలు కూడా తీసుకోవాలి. అందులో మాంసం, చేపలు, గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వాళ్ళ వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే సమయంలో చాలా ఉత్పత్తి అవుతాయి కూడా.
వ్యాయామం:
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు తగ్గడానికి, రక్త ప్రసరణ మెరుగుపడడానికి సహాయపడుతుంది. దీని వల్ల వీర్యకణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒత్తిడి లేకపోవడం వల్ల వీర్య కణాల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీంతో పాటు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
ఇవి మానేయండి
వీర్య కణాల వృద్ధి సరిగ్గా జరగాలన్నా, అవి ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లను మానుకోవాలి. అందులో ధూమపానం, మద్యపానం, వంటివి మానేయాలి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. అలాగే వీర్య కణాల ఉత్పత్తిని నిరోధించే శక్తిగా పని చేస్తాయి. అలాగే వృషణాలు వేడి కలిగించే వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అవి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications