Latest Updates
-
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.?
dandruff in winter: జస్ట్ ఇలా చేస్తే చండ్రు సమస్యకు చెక్!
ప్రస్తుతకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్యల్లో చుండ్రు(dandruff) ఒకటి. ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జుట్టు చుండ్రు వల్ల బలహీనపడుతుంది. ఇదే సమయంలో జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. అపరిశుభ్రమైన వెంట్రుకలు, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం,రాంగ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం,వేడి నీటితో జుట్టును కడగడం వంటివి కూడా చుండ్రుకు కారణం కావచ్చు. ఇది వైద్యపరంగా తీవ్రమైనది కాదు.. కానీ జుట్టు మీద చుండ్రు విపరీతంగా పెరగడం వల్ల జుట్టు తెల్లగా కనబడుతుంది. జుట్టులో చనిపోయిన చర్మం తెల్లటి రేకులు తరచుగా భుజాలపై కూడా పడుతుంది. దీంతో నలుగురిలో వెళ్లి నిలబడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటది.
ఒక్కసారి చుండ్రు రావడం స్టార్ట్ అయిందంటే దానిని ఆపడం చాలా కష్టం. ఈ రోజులలో జుట్టుకు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ఇవ్వడానికి రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. దీంతో కూడా జుట్టులో చుండ్రు వస్తుంది. చుండ్రు కారణంగా తరచుగా తలలో దురద కూడా వస్తుంది. కొన్నిసార్లు జుట్టు కూడా రాలిపోతుంది. కరెక్ట్ టైంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టకపోతే సాధారణ చుండ్రు సమస్య తీవ్రమవుతుంది. చుండ్రుని పోగట్టడానికి మార్కెట్ లో అనేకరకాల యాంటీ డాండ్రూఫ్ షాంపులు,ఇతర ప్రొడక్ట్ లు ఉన్నాయి. అయితే వీటిని వాడటం వల్ల జుట్టుకు తక్కువ ప్రయోజనం,ఎక్కువ హాని కలుగుతుంది. కేవలం కొన్ని హోం రెమెడీస్ తో ఈ చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఇలా చేస్తే చుండ్రు సమస్యని తగ్గించవచ్చు
వేప
వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటితో జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
పెరుగు
పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది..ఇది చుండ్రును తగ్గిస్తుంది. పెరుగును పేస్ట్ లాగా జుట్టు మీద అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
నిమ్మకాయ
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
కలబంద
కలబందలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు ట్రీట్మెంట్ లో సహాయపడతాయి. మీరు నూనె, నిమ్మరసం కలపి కలబందను జుట్టుకి పట్టించవచ్చు.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నుండి విముక్తి పొందవచ్చు.
మెంతులు
మెంతి గింజల పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. మెంతి గింజలను నూనెలో వేసి చల్లార్చుకొని ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications