Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒంట్లో కొవ్వు తగ్గాలంటే.. తినే ఆహారంలో ఈ మార్పులు చేయండి
సంపూర్ణ ఆరోగ్యానికి ఒంట్లోని కొవ్వును బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియ సక్రమంగా సాగడానికి మంచి కొవ్వు చాలా కీలకం. అయితే చెడు కొవ్వు ధమనుల్లో పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే చెడు కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఒంట్లో పేరుకుపోయే చెడు కొవ్వును కరిగించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కొన్ని ఆహారాలు చక్కగా పని చేస్తాయి. కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ ఒంట్లోని చెడు కొవ్వును కరిగిస్తాయి. ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పప్పు - బ్రౌన్ రైస్:
పప్పులో ఫైబర్ సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బ్రౌన్ రైస్ లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పప్పు- బ్రౌన్ కలిపి తిన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ కాంబినేషన్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుంది.
పసుపు - నల్లమిరియాలు:
శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో విరివిగా వాడే మసాలా పసుపు. పసుపులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, చెడు కొవ్వును తగ్గించే లక్షణాలు ఉంటాయి. 12 వారాల పాటు పసుపు-నల్లమిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. నల్ల మిరియాల్లో ఉంటే పైపిరిన్.. పసుపులో ఉండే కర్కుమిన్ రెండు కలిసి కొవ్వును కరిగిస్తాయి.
బాదం - పెరుగు:
బాదం పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ రెండూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గ్రీన్ టీ - నిమ్మకాయ:
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ, నిమ్మకాయను కలిపి తీసుకుంటే ఒంట్లో కొవ్వు స్థాయి తగ్గుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
వెల్లుల్లి - ఉల్లిపాయ:
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది చెడు కొవ్వు ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిన కలిపి తీసుకుంటే కొవ్వు కరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యల దూరం అవుతాయి.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి చిట్కాలు:
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
* ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడం
* ధూమపానం మానేయడం
* మద్యం తీసుకోవడాన్ని పరిమితం చేయడం
* ఒత్తిడిని నిర్వహించడానికి యోగా, ధ్యానం చేయడం
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications