Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్న పనికే చెమటలు కక్కుతున్నారా? ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది
ఎండాకాలం వచ్చిందంటే విపరీతమైన చెమట ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఉన్నా ఉక్కపోత వల్ల అల్లాడిపోతుంటారు చాలా మంది. వేసవికాలం పోలిస్తే మిగతా కాలాల్లో పెద్దగా చెమట రాదు. కష్టం చేసినప్పుడు, ఎండలోకి వెళ్లినప్పుడు చెమట సాధారణంగానే వస్తుంది.
అయితే కొందరికి తరచూ విపరీతమైన చెమట వస్తుంది. కాలంతో సంబంధం లేకుండా చెమటలు కక్కుతుంటారు. అలాంటి వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చెమట సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ:
ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, బ్రష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతుంటారు చాలా మంది. టీ, కాఫీలతోనే రోజును ప్రారంభిస్తారు. కాఫీ లేదా టీ తాగితే హుషారుగా అనిపిస్తుందని చెబుతారు. కాఫీలు, టీలలో ఉండే కెఫిన్ వల్లే ఇలా అనిపిస్తుంది. అయితే ఈ కెఫిన్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కెఫిన్ నాడీ వ్యవస్థపై, హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపిస్తుంది. అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుంది. అలాగే చెమట గ్రంథులను తెరుచుకునేలా చేసి రక్తాన్ని ఎక్కువగా పంపింగ్ చేస్తుంది. అందువల్ల కాఫీ ఎక్కువ తాగే వారిలో చెమట ఎక్కువగా వస్తుంది.
సాల్టీ ఫుడ్స్:
ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం యొక్క జీవక్రియపై డొమినో ప్రభావం ఏర్పడుతుంది. సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఒకరు తింటుంటే, వారు తమ శరీరాన్ని బ్రేక్ డౌన్ మెకానిజానికి పంపుతారు. శరీరంలోకి అధికంగా వచ్చిన సోడియాన్ని వదిలించుకోవడానికి జీవక్రియ ప్రయత్నిస్తుంది. చెమట రూపంలో, మూత్రం రూపంలో సోడియంను బయటకు పంపిస్తుంది. అలా సాల్టీ ఫుడ్స్ తింటే ఎక్కువ చెమట వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆల్కహాల్ ఆధారిత పానీయాలు:
ఆల్కహాల్ తాగినప్పుడు అది రక్తంలోకి చేరుకతుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అప్పుడు రక్త నాళాలు విశాలం అవుతాయి. విస్తరించిన రక్త నాళాల వల్ల చర్మం ఎర్రబడినట్లు అనిపిస్తుంది. ఇది చెమట గ్రంథులు తెరుచుకునేలా చేస్తుంది. దాని వల్ల అధిక చెమట ఇబ్బంది పెడుతుంది.
స్పైసీ ఫుడ్స్:
స్పైసీ ఫుడ్స్ తినడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కారం కారంగా నోటికి తగులుతుంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటారు. స్పైసీ ఫుడ్స్ లో ఉపయోగించే మిర్చీ, కారంలో క్యాప్కైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది చెమట రావడాన్ని ప్రోత్సహిస్తుంది. స్పైసీ గ్రేవీ, చైనీస్ ఫుడ్స్, మిసల్ పావో వంటి కొన్ని రకాల ఫుడ్స్ లలో కూడా క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్రియాశీల సమ్మేళనం. దీని వల్ల అన్నవాహికలో, కడుపులో మండినట్లుగా అనిపిస్తుంది. ఇది శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది. స్పైసీ స్నాక్స్ తినేటప్పుడు చెమట పట్టడం చాలా మంది అనుభవించే ఉంటారు.
సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలు:
సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం దుర్వాసన వస్తుంది. చిన్నప్పుడు పాఠశాలల్లోని ల్యాబుల్లో చాలా మంది సల్ఫర్ ను చూసే ఉంటారు. ఘాటైన వాసన కలిగి ఉంటుంది సల్ఫర్. అయితే సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెమట కూడా దుర్వాసనతో ఉంటుంది.
- ఉల్లిపాయలు
- వెల్లుల్లి
- క్యాబేజీ
- బ్రొకలీ
- కాలీఫ్లవర్
- రెడ్ మీట్
- మోనోసోడియం గ్లుటామేట్ (MSG) లలో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications