Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వేసవి కాలంలో ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది.. రేస్ గుర్రం కూడా పనికిరాదు!
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మార్చి నెల మొదలుకాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి ఎండలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ కాలంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. హెవీ ఉష్ణోగ్రత, సూర్య క్రాంతి వల్ల శరీరానికి తగిన ఆహరం అవసరం. మనం తీసుకునే ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను క్రమంలో ఉంచడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దోహదం చేస్తాయి.
వేసవిలో జీర్ణవ్యవస్థ బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో నీటి కొరత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు ఈ లోపాన్ని పరిష్కరించడంలో సహాయపడతాయి. ఇప్పుడు, వేసవిలో మన ఆరోగ్యానికి అనుకూలమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.

పుచ్చకాయ:
వేసవిలో తినడానికి పుచ్చకాయ అనువైన పండు. ఇందులో దాదాపు 92% నీరు ఉండడం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పుచ్చకాయలో విటమిన్ C, A, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపు ఇస్తాయి. అలాగే, శరీర బలహీనతను తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
దోసకాయ:
వేసవిలో తినడానికి దోసకాయ కూడా చాలా మంచి ఆహరం. ఇందులో కూడా వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ పండులోని తక్కువ కేలరీలు, ఉండడం వలన దీనిని తింటే బరువు కూడా పెరగరు.
పెరుగు:
వేసవి కాలంలో పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, అలాగే తాజాదనాన్ని కాపాడుతుంది. స్మూతీ, రైతా లేదా సలాడ్‌లో కూడా పెరుగు ఉపయోగించవచ్చు.
కొబ్బరి నీళ్లు:
వేసవి అంటే మనకు గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. ఇది సహజంగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉన్న పొటాషియం, సోడియం, ఖనిజాలు శరీరాన్ని చల్లగా ఉంచటంతో పాటు నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడతాయి.
పుదీనా:
పుదీనా వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పుదీనా టీ లేదా షర్బత్ తాగడం వల్ల కండరాలను రిలాక్స్ అవుతాయి. అలాగే ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications