Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఇందుకే అవుతుంది.. జాగ్రత్తగా లేకపోతే సమస్య తప్పదు
వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే జ్వరాలు, జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. అలాగే వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ తో ఇబ్బంది పడుతుంటారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ.
అసలు వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది, ఎండాకాలంలో చాలా మందిని వేధించే ఫుడ్ పాయిజనింగ్ కు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెచ్చని ఉష్ణోగ్రతల్లో బ్యాక్టీరియా పెరుగుదల:
బ్యాక్టీరియా వెచ్చని ఉష్ణోగ్రతల్లో వృద్ధి చెందుతుంది. వేసవి నెలల్లో ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు ఎండలో లేదా వేడికి ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఇలాంటి చెడి పోయిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వేసవిలో అప్పుడే వండిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఫ్రీజ్ లో ఉంచిన వాటిని తినాలి.
క్రాస్ కంటామినేషన్:
ఒక ప్రాంతంలోని బ్యాక్టీరియా ఆహారంపైకి వచ్చినప్పుడు అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవికాలంలో చాలా మంది టూర్లకు, సాయంత్రం వేళ స్ట్రీట్ ఫుడ్స్, బార్బెక్యూలు వంటి వాటిని తింటుంటారు. ఇలా బయట ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరుతుంది.
అలాగే మాంసంలోని బ్యాక్టీరియా కూరగాయలకు, వాటిపై ఉండే క్రీములు మరోదానిపైకి చేరి ఆహారం కలుషితం అవుతుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం పెరుగుతుంది. ఇది వేసవిలో మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
ఆహారం సరిగ్గా వండకపోతే:
హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి, ఆహార విషాన్ని నివారించడానికి సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి. లేకపోతే అందులోని బ్యాక్టీరియా సహా ఇతర హానికరమైన క్రీములు అలాగే ఉండిపోయి అవి కడుపులోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తాయి.

కలుషిత నీరు:
కలుషిత నీరు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు.. సరస్సులు, నదులు, బావులు, జలపాతాళ వద్ద నీటిని తాగడం వల్ల ఈకోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావొచ్చు.
వేసవికాలంలో ఫుడ్ పాయిజనింగ్ తీవ్రమైన సమస్య. అయితే ఫుడ్ పాయిజనింగ్ ను నివారించవచ్చు కూడా. ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం, బయట ఆహారాన్ని తినకపోవడం, వంట వండేటప్పుడు సరిగ్గా ఉడికించడం, కలుషిత నీరు తాగకపోవడం వంటి సరైన చర్యల వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ కు గురికాకుండా ఉండొచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications