Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
మగాళ్లకు భారీ హెచ్చరిక..ఈ ఫుడ్స్ తింటే తండ్రి అవ్వలేరు!..ఎంత శృంగారం చేసినా నో యూజ్
ప్రస్తుతం చాలామంది మగాళ్లను ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది వీర్యకణాల సంఖ్య తగ్గుదల. దీని కారణంగా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. పురుషులు ప్రస్తుతం 40 ఏళ్ల వయసు వచ్చేలోపు వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్ స్టైయిల్,చెడు ఆహార అలవాట్లు. ఒత్తిడితో కూడిన పని ప్రదేశాలు, బిజీ లైఫ్ స్టైయిల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపరు. పేలవమైన ఆహారపు అలవాట్ల ప్రభావం మొత్తం ఆరోగ్యంపై, ముఖ్యంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది
వివిధ కారణాలున్నా ఇదే మెయిన్
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవడం, ఊబకాయం, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా కారణాల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే వీటితో పాటు తినే ఆహారం కూడా పురుషుల స్పెర్మ్ కౌంట్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, ముందుగా అతను తినే ఆహారాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. కొన్ని ఆహారాలు పురుషుల స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి.

ఈ ఫుడ్స్ తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది
-ఈ రోజుల్లో ఆర్గానిక్ గా పండించే పండ్లు, కూరగాయల శాతం చాలా చాలా తగ్గిపోతయింది. మనం తినే కూరగాయలు లేదా ఫ్రూట్స్ అయినా దాదాపు పురుగు మందులు వేసి పండించేవే. పురుగుమందులు వేసిన ఆహార ఉత్పత్తులను మనం సరిగ్గా కడగకుండా తీసుకుంటే అది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదేకాకుండా నాన్‌స్టిక్ వంట పాత్రలలోని కొన్ని రసాయనాలు పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నాన్‌స్టిక్ వంట పాత్రలలో ఎక్కువగా వండటం లేదా తినడం మానుకోండి.
-ప్రాసెస్ చేసిన మాంసాహారం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఆ మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే రసాయనాలు పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను నివారించడానికి ప్రాసెస్ చేసిన మాంసాలను తినకూడదు.
-పాలు శరీరానికి ఆరోగ్యకరమైనవే అని మనందరికీ తెలిసిందే.అయితే పూర్తి కొవ్వు పాలు మాత్రం మన శరీరానికి హానికరం కావచ్చు. అంతేకాకుండా ఆవులకు ఇచ్చే స్టెరాయిడ్లు శరీరానికి హానికరం, అవి ఇచ్చే పాలు తాగడం ద్వారా మగాళ్లలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
-గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకటి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరగడమే కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గి, పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాలకు కూడా మగాళ్లు దూరంగా ఉండాలి.
-సోయా ఉత్పత్తులలో కాల్షియం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటది. కాబట్టి పురుషులు ఈ సోయా ఉత్పత్తులను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ సోయా ఉత్పత్తులలో మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్‌లు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











