Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Heavy Sweat Tips: వేసవిలో విపరీతమైన చెమట వస్తోందా? ఈ ఆహారాలతో కంట్రోల్ చేయవచ్చు
వేసవి వచ్చిందంటే మండిపోయే ఎండలతో పాటు విపరీతమైన చెమట ఇబ్బంది పెడుతుంది. ఎండ వేడిని తగ్గించుకోవడానికి శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాసేపు ఫ్యాన్ ఆపేసినా చెమటతో తడిసిపోతుంటారు. దీని వల్ల దుర్వాసన కూడా వస్తుంది. వేసవిలో ఎదురయ్యే ఈ ఇబ్బందిని కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల పరిష్కరించుకోవచ్చు.
వేసవిలో విపరీతమైన చెమట నుండి బయటపడాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా చెమట పట్టడానికి కారణాలు:
* డయాబెటిస్
* ఇన్ఫెక్షన్లు
* లోబ్లడ్ ప్రెషర్
* థైరాయిడ్ సమస్య
* లుకేమియా
* మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్
* కొన్ని మందుల దుష్ప్రభావాలు
* ఒత్తిడి, ఆందోళన, నిరాశ
* హైజీన్ ఇష్యూస్
1. నీరు:
కాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా నీరు తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. చెమట రూపంలో శరీరం కోల్పోయే నీటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండొచ్చు.
2. అధిక ఫైబర్ ఆహారాలు:
వోట్స్, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెరుగైన జీర్ణక్రియ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. దీని వల్ల చెమట తక్కువగా వస్తుంది.
3. ఆలివ్ నూనె:
ఆహారాన్ని వండడానికి ఆలివ్ నూనె వాడటం వల్ల జీవక్రియ, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రత పెరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా చెమట తగ్గుతుంది.
4. పండ్లు:
యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, పైనాపిల్స్, నారింజ్ వంటి అధిక నీటి శాతం ఉండే పండ్లు తినడం ద్వారా చెమట తక్కువగా వస్తుంది. నారింజ, నిమ్మకాయ, పైనాపిల్స్ వంటి సిట్రస్ పండ్ల సహజ వాసనలను శరీరం శోషించుకుని మంచి వాసనను ఇస్తుంది.
5. కూరగాయలు:
తినే ఆహారంలో ఆకుకూరలు, దోసకాయలు, పాలకూర, క్యాబేజీస, బచ్చలికూర వంటి కూరగాయలను చేర్చుకోవాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చెమటను నియంత్రించడంలో సహాయపడతాయి.
6. గ్రీన్ టీ:
ఎండాకాలంలో వేడి వేడి టీ తాగాలని ఎవరూ అనుకోరు. కానీ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. దీని వల్ల చెమట అదుపులోఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications