Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? బయట ఉంచుతున్నారా? ఏది కరెక్ట్?
రోజుకి ఒక గుడ్డు తినండి,ఆరోగ్యంగా ఉండండి అని తరచూ టీవీల్లో,పేపర్లలో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. నిపుణులు కూడా తరచూ ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. తక్కువ ధరలో లభించే పోషకాల గని అవడంతో గుడ్డును దాదాపు అందరూ తమ ఇంటికి తెచ్చుకుంటారు.
అయితే మార్కెట్ నుండి డజన్ల కొద్దీ గుడ్లను ఇంటికి తెచ్చాక వీటిని ఫ్రిజ్ లో దాచాలా? లేక వంటింటి షెల్ఫ్ లో ఉంచాలా? అనే సందేహం చాలామంది గృహిణులను వేధిస్తుంటుంది. అసలు గుడ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే ఏం చేయాలో, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో ఇక్కడ చూడండి.

విదేశాలకు, మనకు తేడా ఏంటి?
అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే అక్కడ గుడ్లను విక్రయించే ముందే వాటిని శుభ్రంగా కడిగి, ప్యాక్ చేస్తారు. ఈ ప్రక్రియలో గుడ్డు పెంకుపై ఉండే బ్లూమ్ అనే సహజ రక్షణ పొర తొలగిపోతుంది.
ఈ పొర లేకపోవడం వల్ల సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గుడ్డు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడానికి గుడ్లను 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సిందే.
భారతదేశంలో పరిస్థితి వేరు
భారతదేశంలో గుడ్లను కడగకుండానే విక్రయిస్తారు. దీనివల్ల గుడ్డుపై ఉండే సహజ రక్షణ పొర చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా నుండి గుడ్డును కాపాడుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం వాతావరణం.
మనది ఉష్ణమండల దేశం. ఇక్కడ వేడి, గాలిలో తేమ శాతం చాలా ఎక్కువ. గుడ్డుపై రక్షణ పొర ఉన్నప్పటికీ అధిక వేడి వల్ల గుడ్లు త్వరగా చెడిపోతాయి, దుర్వాసన వస్తుంది, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
వేసవి, వర్షాకాలం
బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్లను రిఫ్రిజిరేటర్ లో ఉంచడమే ఉత్తమమైన మార్గం.
శీతాకాలం
వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఉతకని గుడ్లను బయట గది ఉష్ణోగ్రత దగ్గర 4-5 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు..అవి తాజాగా ఉంటాయి.
ఫ్రిజ్ నుండి తీశాక ఏం చేయాలి?
చాలామంది చేసే తప్పు ఇక్కడే ఉంది. ఫ్రిజ్ నుండి చల్లటి గుడ్లను బయటకు తీసినప్పుడు గదిలోని వేడి గాలి తగిలి వాటి ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ తేమ బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను మాటిమాటికీ బయటకు తీయడం, మళ్లీ లోపల పెట్టడం చేయకూడదు. వండుకోవడానికి ఎంత అవసరమో అంతే బయటకు తీయాలి.
గుడ్డు ఫ్రెష్ దని తెలుసుకోవడం ఎలా?
ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని అందులో గుడ్డు వేయండి. గుడ్డు నీటి అడుగున స్థిరంగా ఉంటే అది తాజాది. అలా కాకుండా నీటిపై తేలుతుంటే, అది పాడైపోయినది.. దాన్ని వెంటనే పారవేయండి.
మన దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా వేసవిలో గుడ్లను ఫ్రిజ్‌లో భద్రపరచుకోవడం ద్వారా వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications