Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఈ చిన్న గుడ్లలో ఇన్ని పోషకాలా? పుతిన్ ఆరోగ్య రహస్యం గురించి తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన పుతిన్..తన వయసు కంటే చాలా చిన్నగా, దృఢంగా కనిపిస్తారు. గత వారం పుతిన్ భారత్ లో పర్యటించారు. ఆ సమయంలో భారత్-రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే అదే సమయంలో పుతిన్ ఫిట్ నెస్ రహస్యాలు చర్చనీయాంశమయ్యాయి.
73 ఏళ్ల వయస్సులో కూడా పుతిన్ లో ఉట్టిపడే శక్తి, చురుకైన జీవనశైలి వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన తీసుకునే ఆహారమే. 'ఫ్రాజిల్ ఎంపైర్: హౌ రష్యా ఫెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ విత్ వ్లాదిమిర్ పుతిన్' అనే పుస్తకం ప్రకారం..పుతిన్ తన బ్రేక్ ఫాస్ట్ లోకి కౌజు పిట్ట గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటారు. పుతిన్ ఫిట్‌నెస్ మంత్రంగా మారిన ఈ కౌజు పిట్ట గుడ్లను సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో ఇక్కడ చూడండి.

కౌజు పిట్ట గుడ్లే ఎందుకు?
చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉన్నా పోషకాల విషయంలో ఇవి కోడి గుడ్ల కంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. వీటిలో విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు వీటిని సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తారు.
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
నేటి కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. కౌజు పిట్ట గుడ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి12 శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
పుతిన్ వంటి నాయకులకు ఏకాగ్రత చాలా అవసరం. కౌజు పిట్ట గుడ్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని, దృష్టిని పదునుపెడతాయి.
కోడి గుడ్లతో పోలిస్తే కౌజు పిట్ట గుడ్లలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగానూ, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగానూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జిమ్ చేసేవారికి, అథ్లెట్ల కు కౌజు పిట్ట గుడ్లు వరం లాంటివి. అధిక ప్రోటీన్ కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణజాలం బాగుపడటానికి సహాయపడుతుంది.
కౌజు పిట్ట గుడ్లలో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కౌజు పిట్ట గుడ్లలో ఉండే బయోటిన్, జింక్ అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే పుతిన్ చర్మం అంత మెరుస్తూ ఉంటుంది.
ఎలా తినాలి? ఎంత తినాలి?
పిట్ట గుడ్లను ఉడికించి తినడం లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం మంచిది. సలాడ్లలో కలుపుకుని కూడా తినవచ్చు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి లేదా ఎక్సర్ సైజ్ తర్వాత తీసుకోవడం ఉత్తమం.
పిల్లలు: రోజుకు 1-2 గుడ్లు.
పెద్దలు: రోజుకు 2-4 గుడ్లు.
జిమ్ చేసేవారు: 4-6 గుడ్లు.
జాగ్రత్తలు
గుడ్డు ప్రోటీన్ అలెర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు తాజా గుడ్లను మాత్రమే ఎంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
