Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆరోగ్యానికి అమృతం..రోజూ పరగడుపున ఇది తాగితే 100 ఏళ్లు సేఫ్!
రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అని తరచుగా పాశ్చాత్య దేశాల నిపుణులు చెబుతుండటం వింటుంటాం. కానీ మన భారతీయ సంప్రదాయంలో రోజూ ఒక ఉసిరికాయ తింటే అనారోగ్యం దరిచేరదు అని పెద్దలు చెబుతుంటారు.
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరాలలో ఉసిరి ఒకటి. దీనిని ఆయుర్వేదంలో అమృతఫలం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఉసిరి ఎందుకు తినాలి?
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన ఇంధనంలా పనిచేస్తుంది. సీజనల్ వ్యాధుల నుండి రక్షించడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చాలామంది బద్ధకంతోనో, సమయం లేకనో మార్కెట్లో దొరికే నిల్వ ఉంచిన ఉసిరి రసాలను కొని తాగుతుంటారు. కానీ అందులో ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. స్వచ్ఛమైన ఆరోగ్యం కావాలంటే, ఇంట్లోనే తాజా ఉసిరికాయలతో రసం తయారు చేసుకోవడమే ఉత్తమ మార్గం.
మిక్సర్ లో ఉసిరి రసం తయారు చేయడం ఎలా?
-ముందుగా తాజా ఆకుపచ్చని 7 ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, లోపలి గింజలను తీసివేయాలి.
-ఉసిరి ముక్కలను మిక్సర్ జార్ లో వేసి అందులో సుమారు అర కప్పు నీళ్లు పోయాలి. దీనిని మెత్తని పేస్ట్ లా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెపై జల్లెడ లేదా మస్లిన్ క్లాత్ ఉంచి, ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. మస్లిన్ క్లాత్ అయితే రసం పిండడానికి చాలా సులభంగా ఉంటుంది.
-వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిలో ఇంకా సారం ఉంటుంది. కాబట్టి ఆ పిప్పిని తిరిగి మిక్సర్ జార్ లో వేసి మరో 2-4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా గుడ్డలో వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఉసిరిలోని చివరి చుక్క రసం కూడా వృథా కాకుండా మనకు లభిస్తుంది. ఉసిరి రసం రెడీ.
-దీనిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 1-2 ఉసిరికాయల మోతాదులో రసాన్ని తీసుకోవడం మంచిది.
-ఖరీదైన మందుల కంటే వంటింట్లో తయారయ్యే ఈ సహజసిద్ధమైన పానీయం మీ చర్మానికి, జుట్టుకు మరియు మొత్తం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications