Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పురుషుల పాలిట సంజీవని..మన చుట్టూ దొరికే ఈ గింజల లాభాలు తెలిస్తే వదలరు!
మన చుట్టూ లభించే కొన్ని సాధారణ గింజలు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతాయని మీకు తెలుసా? అటువంటి అద్భుతమైన ఔషధ నిధే కౌంచ్ గింజలు. వీటిని ఇంగ్లీష్ లో మ్యాజిక్ వెల్వెట్ బీన్స్ అని పిలుస్తారు. భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో విరివిగా పండించే ఈ చిక్కుడు జాతి గింజలు ప్రోటీన్ కు పెట్టింది పేరు.
జిమ్ వెళ్లే వారి నుండి మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఈ గింజలు ఒక దివ్యౌషధం లాంటివి. మరి ఈ మ్యాజిక్ బీన్స్ మన శరీరానికి చేసే మేలు ఏంటో ఇక్కడ చూడండి.

జిమ్ లవర్స్ కి సూపర్ ఫుడ్
కౌంచ్ గింజల్లో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే జిమ్ కు వెళ్లేవారికి ఇది ఒక మంచి ఆహార ఎంపిక.
పార్కిన్సన్స్,ఆర్థరైటిస్ కు చెక్
నాడీ వ్యవస్థకు సంబంధించిన పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కౌంచ్ గింజలు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి, శరీర నొప్పులను తగ్గించడానికి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ గుణాలు (నొప్పి నివారణ) అద్భుతంగా పని చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
గుండెకు రక్షణ - కొలెస్ట్రాల్ నియంత్రణ
రక్తంలో పేరుకుపోయిన మలినాలను, చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కౌంచ్ గింజలకు యాంటీ-లిపిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఒత్తిడి,నిద్రలేమికి పరిష్కారం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, నిద్రలేమి సాధారణ సమస్యలుగా మారాయి. కౌంచ్ గింజల్లో ఉండే యాంటిడిప్రెసెంట్ లక్షణాలు ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఈ గింజల పొడిని పాలలో కలుపుకుని తాగితే ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
పురుషుల ఆరోగ్యానికి సంజీవని
ముఖ్యంగా పురుషుల లైంగిక ఆరోగ్యానికి కౌంచ్ గింజలు ఒక వరం అని చెప్పవచ్చు. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి, స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడతాయి. పురుషుల వంధ్యత్వాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
తీసుకోవాల్సిన పద్ధతి, జాగ్రత్తలు
కౌంచ్ గింజల పొడిని పాలతో కలిపి తీసుకోవడం ఉత్తమ మార్గం. సాధారణంగా 3 నుండి 5 గ్రాముల పొడిని సిఫార్సు చేస్తారు. అయితే ఇది ఎంత మంచిదైనా అతిగా తీసుకోవడం వల్ల వికారం, తలనొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ మ్యాజిక్ బీన్స్ను మీ డైట్‌లో చేర్చుకునే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు వాడటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications