Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఈ పండ్లు తింటే పడగ్గదిలో ఎక్కువసేపు ఎంజాయ్ చేయవచ్చు
శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని, ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఉండదు. భాగస్వామితో సెక్స్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే చాలా అంశాలు కలిసిరావాలి. కోరికలు లేకపోతే శృంగారాన్ని ఆస్వాదించలేం. అలాగే కోరికలు ఉన్నా ఎక్కువ సేపు సెక్స్ చేయకపోతే కూడా అలాంటి సెక్స్ వల్ల ఎవరో ఒకరు అసంతృప్తి చెందాల్సిందే.

సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి వైద్య నిపుణులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం లైంగిక జీవితానికి అవసరం. మెరుగైన రక్త ప్రసరణతో పురుషుల్లో, స్త్రీలలో మెరుగైన లైంగిక ప్రతిస్పందనకు దారి తీస్తుంది. కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే ఇతర పోషకాలు సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరిచే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుంది. ఏయే పండ్లను తింటే సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు:
స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ వల్ల పురుషుల్లో, మహిళల్లో శృంగార కోరికలు వస్తాయి. శరీరంలో కావాల్సిన స్థాయిలో జింక్ ఉంటే సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. జింక్ పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్ స్థాయిని నియంత్రిస్తుంది. సంభోగం సమయంలో జింక్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయి.
అవకాడోలు:
అవకాడోలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తాయి. ఫోలిక్ యాసిడ్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. విటమిన్ బి6 హార్మోన్లను స్థిరీకరిస్తుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయ లోని పోషకాలు అంగస్తంభనను మెరుగుపరుస్తాయి. దీని వల్ల పురుషుల్లో సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుంది. శరీరంలోని అమైనో ఆమ్లాలు, ఆర్జినైన్ లను విడుదల చేసే సిట్రులిన్ కూడా పుచ్చకాయ ద్వారా లభిస్తుంది. వాస్కులర్ ఆరోగ్యానికి అర్జినైన్ బాధ్యత వహిస్తుంది.
బాదం:
బాదంలో ఆర్జినిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను సడలిస్తుంది. బాదంపప్పులో ఉండే అమైనో యాసిడ్ అంగస్తంభనను నిర్వహించడానికి సహాయపడుతుంది.
వాల్‌నట్‌లు:
వాల్‌నట్స్‌లో ఓమేగా-3 ప్యాటీ యాసిడ్స్, డోపమైన్ పెంచే ఆరోగ్యకరమై కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అర్జినైన్ అనే అమైననో యాసిడ్ కూడా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్త నాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
అరటి పండ్లు:
అరటి పండ్లలోని పొటాషియం సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం ఉద్వేగాన్ని తీసుకువస్తుంది. అరటి పండ్లలో లభించే బ్రోమెలైన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications