Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల ప్రయోజనాలివే..దగ్గు,జలుబు కూడా పరార్!
మన వంటగదుల్లో ఏది ఉన్నా లేకున్నా వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఏ సీజన్ లో అయినా సరే భారతీయ వంటగదుల్లో వెల్లుల్లి ఉండి తీరాల్సిందే. మన వంటకాల్లో వెల్లుల్లికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వెలుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం, రుచి రెండింటిలోనూ వెల్లుల్లి చాలా ప్రయోజనకరమైనది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడే అనేక లక్షణాలను వెల్లుల్లి కలిగి ఉంటుంది.
చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య దగ్గు జలుబు. ఈ సమయంలో వెల్లుల్లిని తినడం వలన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ వెల్లుల్లి రెబ్బలు తినడం కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, డయాబెటిస్ ట్రీట్మెంట్ లో ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లి దాని వేడి స్వభావంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక అంటు వ్యాధులను నివారించడంలో వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డయాబెటిస్
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో మధుమేహంతో బాధపడేవాళ్లు ఉన్నారు. అయితే మధుమేహం ఉన్నవాళ్లు పచ్చి వెల్లుల్లిని తినాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది..దీని పని రక్తంలో షుగర్ లెవల్ ని కంట్రోల్ చేయడం. అందుకే తెల్లవారుజామున నాలుగు వెల్లుల్లి రెబ్బలు తింటే మధుమేహ వ్యాధికి ఉపశమనం కలుగుతుంది.
బరువు
ఊబకాయంతో బాధపడుతున్నవారికి కూడా వెల్లుల్లి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో కొన్ని ప్రత్యేక మూలకాలు ఉంటాయి..వాటి వల్ల శరీరంలో ఉండే కొవ్వు నాశనమవుతుంది. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది.
చర్మ వ్యాధులు
వెల్లుల్లిలోని అజోయిన్ అనే ఎంజైమ్ అనేక చర్మ వ్యాధులతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు చాలామంది వెల్లుల్లి వాడుతుంటారు.
క్యాన్సర్
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్.. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినడం చాలా ప్రయోజనకరంగా ఉండటానికి ఇదే కారణం. ఇలా చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్నవాళ్లు రోజూ రెండు రెబ్బలు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరమవుతుంది.
డిప్రెషన్
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి వెల్లుల్లి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మనస్సు సమతుల్యంగా ఉంటుంది. డిప్రెషన్ తో పోరాడడంలో కూడా ఇది సహాయపడుతుంది. మీరు ఒత్తిడిని నివారించాలనుకుంటే వెల్లుల్లి తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications