వర్షాకాలంలో ఫేషియల్‌ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!

వర్షాకాలంలో ముఖానికి ఫేషియల్‌ చేయించుకోవాలా వద్దా.. ఇది చాలా మంది అమ్మాయిల్లో నెలకొనే సందేహం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా జరిగే ఈ సీజన్‌లో చర్మ నిగారింపు కోసం ఇంట్లోనే సహజ పద్ధతులు లేదా బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో ఈ సీజన్‌లో ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్‌ ద్వారా మేలు జరుగుతుందా.. ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అనే సందేహాలకు సమాధానాలు..

get a facial during the monsoon Learn the important suggestions

చర్మ సంరక్షణలో భాగంగా ఫేషియల్‌ అనేది చాలా సాధారణ ప్రక్రియగా మారింది. ఫేషియల్‌ చేయించుకోవడం ద్వారా ముఖంపై మృతకణాలను తొలగించి చర్మంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖాన్ని శుభ్రపరచడం నుంచి మసాజ్‌ చేయడం, ఫేస్‌ ప్యాక్‌ ఇలా చాలా రకల దశలు ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా చర్మం కాంతి పెరగడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా కొన్ని ఉత్పత్తులు చర్మానికి తేమను కూడా అందిస్తాయి. అయితే వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న కారణంగా ముఖం జిగటగా మారుతుంది. దీంతో ఫేషియల్‌ చేయించుకోవాలా వద్దా అనే దానిపై గందరగోళం నెలకొంటుంది.

గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్‌.. మీ భోజనంలో తప్పనిసరి.!గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్‌.. మీ భోజనంలో తప్పనిసరి.!

వర్షాకాలంలో ఫేషియల్స్

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్న కారణంగా.. చెమట, మురికి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నూనె, చెమట వల్ల ముఖం కాంతివిహీనంగా మారుతుంది. అందుకే ఈ కాలంలో మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవడం ముుఖ్యం. ఇంకా పుష్కలంగా నీరు తాగుతూ డీహైడ్రేషన్‌ను నివారించాలి. కాబట్టి వర్షాకాలంలో ఫేషియల్‌ చేయించుకోవడం మంచిదే.. కానీ ఈ పద్ధతికి వెళ్లే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

హెవీ ప్రొడక్ట్స్‌ వద్దు

ఈ కాలంలో మీరు ఫేషియల్‌ చేయించుకునేటప్పుడు తేలికైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. క్రీమీ, నూనె ఆధారిత ఉత్పత్తుల కంటే కూడా వాటర్‌, జెల్‌ ఆధారిత ఉత్పత్తులు ముఖాన్ని తాజాగా, తేమగా ఉంచుతాయి.

get a facial during the monsoon Learn the important suggestions

తేలికగా మర్దన

వర్షాకాలంలో మీ చర్మం జిగటగా ఉన్నా.. తేమగా లేకపోతే అది సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందుకే ఫేస్‌ వాష్‌ లేదా ఫేషియల్‌ సమయంలో సున్నితమైన స్క్రబ్‌ను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా అదే పనిగా ముఖంపై రుద్దకూడదు. ముఖానికి ఆవిరి పట్టడం ద్వారా కూడా మలినాలు సులభంగా తొలగిపోతాయి.

ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్‌.!ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్‌.!

సహజ ఉత్పత్తులు

వర్షాకాలంలో ఫేషియల్‌, స్కిన్‌ కేర్‌ రొటీన్‌ కోసం వీలైనంత వరకు సహజమైన ఉత్పత్తులనే ఎంచుకోండి. చర్మానికి ఉపశమనాన్ని అందించే కలబంద, రోజ్‌ వాటర్‌, కీర దోస వాటి నుంచి తయారైన ప్రొడక్ట్స్‌ మేలు చేస్తాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తూ, చల్లబరిచి, తాజాగా ఉంచుతాయి.

సన్‌స్క్రీన్‌ తప్పనిసరి

వర్షాకాలంలో ఎండలు తక్కువ ఉన్న కారణంగా సన్‌స్క్రీన్‌ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. యూవీ కిరణాలు, తేమ కారణంగా చర్మంపై ప్రభావం పడుతుంది. అందుకే చర్మ రక్షణ కోసం ఫేషియల్‌ చేయించుకునే సమయంలో బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం తప్పనిసరి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 5, 2026, 17:28 [IST]
Desktop Bottom Promotion