Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎవరినైనా టచ్ చేస్తే 'టక్కు' మని షాక్ కొడుతుందా? అసలు రహస్యం ఇదే
సాధారణంగా మనం ఎవరినైనా టచ్ చేసినప్పుడు కొన్ని సందర్భాలలో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. దీంతో నీలో ఏదో కరెంట్ ఉంది అని సరదాగా ఆ వ్యక్తితో అంటుంటాం. చాలా సందర్భాలలో ఇలా జరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి దీనిని స్టాటిక్ ఎలక్ట్రిసిటి అని పిలుస్తుంటారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే..మన శరీరం లేదా బట్టల మీద ఒక రమైన విద్యుత్ నిల్వ ఉండటం.
రెండు వస్తువులు ఒకదానినొకటి రాసుకున్నప్పుడు షాక్ కొట్టినట్లు జరుగుతుంది. మీరు ఉన్ని,పాలిస్టర్ లాంటి బట్టలు వేసుకుంటే మీ శరీరం మెల్లగా అదనపు విద్యుత్ ఛార్జ్ ని తనలో నింపుకుంటుంది. ఈ ఛార్జ్ బయటకు వెళ్లడానికి ఒక దారి దొరికే వరకు మీ చర్మం మీదనే ఉంటుంది. మీరు ఎవరినైనా తాకినా లేదా ఏదైనా లోహ వస్తువును ముట్టుకున్నా ఆ నిల్వ ఉన్న విద్యుత్ ఒక్కసారిగా మీ శరీరం నుంచి దూసుకుపోతుంది. ఆ వేగంగా జరిగే విద్యుత్ కదలికే టక్కు మని షాక్ కొడుతుంది. ఆ క్షణంలో జివ్వుమనిపించడం వెనుక ఉన్న సైన్స్ ఇదే.

ఎక్కువగా ఈ సీజన్ లోనే ఇలా జరుగుతుందట
సాధారణంగా ఈ చిన్న షాక్ లు శీతాకాలంలో ఎక్కువగా జరుగుతాయి. శీతాకాంలో చల్లని గాలి పొడిగా ఉంటుంది..ఛార్జ్ మీ శరీరం నుంచి ఈజీగా బయటకు వెళ్లనివ్వదు. శీతాకాలంలో ఇండోర్ హీటర్లు గాలిని మరింత పొడిగా చేస్తాయి, ఇది షాక్ లను మరింత సాధారణం చేస్తుంది. సమ్మర్ లో గాలిలో ఎక్కువ తేమ ఉంటుంది..ఇది మీరు అనుభూతి చెందకముందే ఛార్జ్ ను తొలగించడానికి సహాయపడుతుంది.
ఇది ఆరోగ్యానికి ప్రమాదమా
వాస్తవానికి ఈ షాక్ లు ఆరోగ్యానికి హానికరం ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. అవి ఒక్క క్షణం అసౌకర్యంగా అనిపిస్తాయే తప్ప శరీరానికి ఏ విధమైన హాని కలిగించవచ్చి చెబుతున్నారు. అయినప్పటికీ పెట్రోల్ బంకులు లేదా సున్నితమైన ఎలక్ట్రిక్ డివైజ్ లు ఉన్న ప్లేస్ లలో మాత్రం ఈ స్టాటిక్ విద్యుత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాంటి ప్రదేశాలలో చిన్న స్పార్క్ కూడా సమస్యలు కలిగిస్తుంది కాబట్టి అక్కడ పనిచేసేటోళ్లు అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు.
దీనిని నివారించాలంటే ఏం చేయాలి
స్టాటిక్ విద్యుత్ రాకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలను పాలో అవ్వాలి. అందులో ప్రధానంగా . సింథటిక్ బట్టలకు బదులుగా కాటన్ దుస్తులు ధరించండి. ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం కూడా ఛార్జ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. మరో వ్యక్తిని తాకే ముందు లోహ వస్తువును తాకడం ద్వారా ఛార్జ్ సురక్షితంగా విడుదల అవుతుంది. పొడి చర్మం ఎక్కువ చార్జ్ ను కలిగి ఉంటుంది కాబట్టి మీ చర్మాన్ని తేమగా ఉంచుకోండి. మీ ఇంట్లో గాలికి తేమను జోడించడానికి హ్యూమిడిఫైయర్ ను ఉపయోగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications